హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. నేడు పలు ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు

-

హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. నేడు భాగ్యనగరంలో పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు. నిర్వహణ పనుల కారణంగా ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. లింగంపల్లి టు హైదరాబాద్ మార్గంలో 9 రైళ్లను రద్దు చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ టు లింగంపల్లి 9 రైళ్లు, ఫలక్ నూమా టు లింగంపల్లి ఏడు రైళ్లు, లింగంపల్లి టు ఫలక్నామ 7 రైళ్లు,

సికింద్రాబాద్ టు లింగంపల్లి మార్గంలో ఒకటి మరియు లింగంపల్లి టు సికింద్రాబాద్ మార్గంలో ఒక రైలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు . హైదరాబాద్ ప్రయాణికులు తమ ప్రయాణాలను ఇతర మార్గాల ద్వారా చేసుకోవాలని కోరారు. కాగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీనితో ప్రయాణాలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version