భారతదేశ ప్రజలకి మూడు రకాల కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్, ఇంకా రష్యా నుండి దిగుమతి చేసుకున్న స్పుత్నిక్ వి. ఈ మూడు వ్యాక్సిన్లు కరోనా నుండి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా మరో వ్యాక్సిన్ కి భారత ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మోడెర్నా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ఇండియాకి రానుంది. ఈ మేరకు నీతీ ఆయోగ్ ఆరోగ్య మెంబరు వీకే పాల్ తెలియజేసారు.
భారతదేశానికి చెందిన సిప్లా కంపెనీ, మోడెర్నా కరోనా వ్యాక్సిన్ ని అత్యవసర సమయంలో వాడడానికి ఉపయోగించే మందుగా భారతదేశానికి అందిస్తుంది. ఈ మేరకు అనుమతులు వచ్చాయి. ఐతే ఈ వ్యాక్సిన్ ని ఉపయోగించడానికి అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, అమెరికాకి చెందిన ఫైజర్ వ్యాక్సిన్ కూడా ఇండియాలోకి రానుందని తెలుస్తుంది. మోడెర్నా వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఫైజర్ కూడా వస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు.