ఎమ్మెల్సీ కవితపై మరోసారి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు. ప్రపంచ అవినీతిపరురాలు కవిత అంటూ వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నా మీద పోటీ చేసేందుకు కవిత భయపడుతోంది. వేరే అభ్యర్థిని బరిలో ఉంచి నన్ను ఓడిస్తుందట. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే డిప్యూటీ సీఎం సిసోడియా జైలు పాలయ్యారు. ఆయనను చూసేందుకు కవితక్క కూడా పోతాది. అందరూ దేవున్ని మొక్కండి కవిత జైలుకు పోవాలని. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నాకు తండ్రితో సమానం. కానీ కాంగ్రెస్ పని అయిపోయింది.’’ అని అరవింద్ వ్యాఖ్యానించారు.
పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కాడని ఆరోపించారు. డబుల్ బెడ్ రూంలు, కాళేశ్వరం ప్రాజెక్టుల పేరు చెప్పి దోచుకున్న సొమ్ముతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాలు చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆవాస్ యోజన స్కీమ్ ను ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీం అమలు చేస్తే రాష్ట్రానికి రెండు లక్షల ఇళ్లు వస్తాయని అన్నారు.