మరోసారి ట్విట్టర్ వేదిక వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. తాజాగా విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో.. చంద్రబాబు పుట్టిన తర్వాతే అబద్ధం అనే పదం తెలుగు డిక్షనరీలో చేరింది. అతను అసత్యాలను అలవోకగా వాడినట్టుగా గోబెల్స్ కూడా వాడలేదు. చివరకు తానే ఒక నమ్మకం లేని మనిషి అయిపోయాడు. దేశ రాజకీయాల్లో ఇలాంటి Pathological Liar ఇంకెక్కడా కనిపించడు. అంత చెత్త పేరు తెచ్చుకున్నాడు ముసలి నక్క. బాగున్న రోడ్లను తవ్వుతూ, వర్షాలకు దెబ్బతిన్నరోడ్లపై సెల్ఫీలు దిగేకంటే వాటిని పూడ్చి పేరు తెచ్చుకోండి.
‘మన రోడ్లను మనమే బాగుచేసుకుందాం’ అనే స్పూర్తిని ప్రదర్శించండి. జనాదరణ పెరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో పాడైన రోడ్ల ఫోటోలతో వెర్రి పుష్పాలు కావొద్దు. గజినీ బాబు కోరుకునేది అదే. కరెంటు లేని రోజుల్లో జనరేటర్లతో నడిచే టూరింగ్ టాకీసులు గ్రామాలకు వస్తే ఊరంతా అక్కడే ఉండేది. సినిమా హాళ్ళు, మల్టీప్లెక్సులు ఆ తర్వాత అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి OTTలు వచ్చాయి. జనం ఈ మార్పులను స్వాగతిస్తున్నా స్టే’బిఎన్ మాత్రం పాత రోజుల్లోనే బతుకుతున్నాడు. భజన మీడియా కూడా అంతే. అంటూ మండిపడ్డారు.