టార్గెట్ 12: నల్గొండలో ‘హస్తం’ హవా..?

-

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి…ఇప్పటివరకు లీడ్ లో ఉన్న టీఆర్ఎస్ ఆధిక్యం నిదానంగా తగ్గుతూ వస్తుంది…అలాగే ఎక్కడో అట్టడుగున ఉండే బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటుంది…ఇక బలం కోల్పోయిన కాంగ్రెస్ ఇప్పుడు బలం పెంచుకుంటుంది..ఓవరాల్ గా చూస్తే తెలంగాణలో త్రిముఖ పోరు నడుస్తోంది. అయితే తాజాగా వస్తున్న సర్వే ఫలితాలని బట్టి చూస్తే ఒకో జిల్లాల్లో ఒకో రకంగా పోటీ ఉంది. అసలు ఊహకు అందని విధంగా పోటీ నడుస్తోంది. ఒక జిల్లాలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటే…మరో జిల్లాలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. ఇక కొన్ని జిల్లాల్లో టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య ట్రైయాంగిల్ ఫైట్ జరుగుతుంది.

అయితే పోటీలో ఒకో జిల్లాలో ఒకో పార్టీ లీడ్ లో కనిపిస్తోంది. ఉదాహరణకు కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లో టీఆర్ఎస్ లీడ్ లో ఉంటే…హైదరాబాద్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో బీజేపీ ఎడ్జ్ లోకి వస్తుంది. ఇటు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. ఇక తాజాగా వస్తున్న సర్వేల్లో నల్గొండలో హస్తం హవా నడుస్తుందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేలా ఉంది.

మామూలుగా నల్గొండ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట..కానీ గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ హవా నడిచింది…కానీ ఈ సారి మాత్రం కాంగ్రెస్ సత్తా చాటుతుందని తెలుస్తోంది. ఇప్పటికే వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో అదే విషయం రుజువైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందని సర్వే తెలిపింది. నాగార్జునసాగర్‌, హుజూర్‌నగర్‌, కోదాడ, తుంగతుర్తి, నల్గొండ, మునుగోడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిచే ఛాన్స్ ఉంది. ఆలేరు, నకిరేకల్‌, భువనగిరి, దేవరకొండ స్థానాలు టీఆర్‌ఎస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. సూర్యాపేట, మిర్యాలగూడ స్థానాల్లో  పోటాపోటి ఉంది. ఇక్కడ బీజేపీ ప్రభావం తక్కువగా ఉంది. అదే సమయంలో షర్మిల పార్టీ ప్రభావం కాంగ్రెస్ పై పడనుందని తెలుస్తోంది. షర్మిల పార్టీ వల్ల ఒకటి, రెండు సీట్లలో కాంగ్రెస్ కు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి…లేదంటే జిల్లాలో 8 పైనే సీట్లు కాంగ్రెస్ వశం అవుతాయి.

అయితే 12కి 12 స్థానాలు గెలుస్తామని కోమటిరెడ్డి మాట్లాడుతున్నారు…ఇంకా గట్టిగా కష్టపడితే నల్గొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయొచ్చు. మరి ఆ పరిస్తితి కాంగ్రెస్ కు వస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news