‘జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు’ : ఎంపీ విజయసాయి రెడ్డి

-

వైసీపీ ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగపరమైన హక్కుగా చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యం, తమ పార్టీ వైఖరి అని పేర్కొన్నారు. అందుకే రాజ్యసభలో బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టామని వెల్లడించారు విజయసాయి రెడ్డి. బీసీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్ కల్పించాలన్నదే తమ సిద్ధాంతం అని విజయసాయి స్పష్టం చేశారు. తాము బీసీ జనాభా గణనను కోరామని తెలిపారు విజయసాయి రెడ్డి. బీసీలకు సమన్యాయం జరగాలని సీఎం జగన్ ఎప్పుడూ ఆకాంక్షిస్తుంటారని, బీసీల ఆత్మగౌరవాన్ని పెంచింది సీఎం జగన్ అని విజయసాయి రెడ్డి వివరించారు.

Vijayasai Reddy: ఎలన్ మస్క్ కు ఐడియాలు ఇచ్చే చందబ్రాబుకు.. జూనియర్ ఎన్టీఆర్  పేరు వింటే భయమేలా?– News18 Telugu

అనంతరం మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ.. ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభతో ఏపీ రాజకీయ ముఖచిత్రం మారిపోయిందని అన్నారు. టీడీపీ హయాంలో బీసీలను బానిసలుగా వాడుకున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ఆ పరిస్థితిని మార్చారని, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి, ప్రోత్సహించారని కొనియాడారు. సీఎం జగన్ కు బీసీలంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు జోగి రమేశ్.

Read more RELATED
Recommended to you

Latest news