Mrunal Thakur : వెక్కివెక్కి ఏడ్చిన మృణాల్.. ఆందోళనలో ఫ్యాన్స్

-

సీతారామం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకుంది బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలోని ఆమె నటన, అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ.. తన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా మృణాల్ ఏడుస్తూ ఉన్న ఒక ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటో చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే తను ఎందుకు ఏడ్చిందో కూడా పోస్టులో వివరించడంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే..?

“నిన్న చాలా కష్టంగా గడిచింది. కానీ ఈరోజు నేను చాలా సంతోషంగా, బలంగా, తెలివిగా ఉన్నా. ప్రతి ఒక్కరి జీవిత కథలో కొన్ని చదవని పేజీలుంటాయి. వాటిని ఎవరూ బయటపెట్టరు. కానీ నేను మాత్రం వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే నేను నేర్చుకున్న పాఠం ఇతరులకూ తెలియాలి. వారు కూడా నేర్చుకోవాలి.  నాకు కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ ఫొటో దిగాను. కానీ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా. అనుకుంది సాధించాను” అంటూ మృణాల్ తన పోస్టులో రాసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version