మనీ పాలిటిక్స్..హుజూరాబాద్ ని మునుగోడు దాటేస్తుందా?

-

డబ్బు…దీనితో అన్నీ మారిపోతాయి..డబ్బుతో ఏదైనా చేయొచ్చు…ఏదైనా సాధించవచ్చు అనే పరిస్తితికి వచ్చేసింది. డబ్బు అనేది అన్నీ రంగాల్లో కీలకమైపోయింది. ముఖ్యంగా రాజకీయ రంగంలో డబ్బు కీలకపాత్ర పోషిస్తుంది. డబ్బు ఉంటే చాలు రాజకీయాన్ని మార్చేయొచ్చు…గెలుపోటములని తారుమారు చేయొచ్చు…డబ్బు బట్టే అధికారం కూడా మారిపోయే పరిస్తితి ఉంది. ఎన్నికల్లో నేతలు పంచే డబ్బులే గెలుపోటములకు కీలకం.

ఇప్పుడు అదే డబ్బు మునుగోడు ఉపఎన్నికలో కీలకమైంది. ఒక్క హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలవడానికి ప్రధాన పార్టీలు ఎంత ఖర్చు పెట్టాయో చెప్పాల్సిన పని లేదు. తెలంగాణలో అత్యంత డబ్బు ఖర్చు పెట్టిన ఎన్నిక కూడా అదే. అయితే హుజూరాబాద్ ని మునుగోడు దాటేసేలా ఉంది. ఇంకా ఉపఎన్నిక షెడ్యూల్ రాకముందే…అక్కడ మనీ ప్రవాహం మొదలైందని తెలుస్తోంది. మనీతోనే రాజకీయం నడిపించే పరిస్తితి. ఇప్పటికే ఓటర్లని ఆకర్షించడానికి ప్రధాన పార్టీలు తమదైన శైలిలో రాజకీయం చేయడం మొదలుపెట్టాయి.

అలాగే ఓటర్లని ఆకట్టుకోవడానికి అప్పుడే తాయిలాలు ఇచ్చే కార్యక్రమం కూడా నడుస్తుందని సమాచారం. ఇక మునుగోడు గెలుపోటములని డిసైడ్ చేసేది..ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలే. ఇప్పుడు ఏ పార్టీలో బలమైన నేత ఉంటే..ఆ నేతకు ఇతర పార్టీల వారు వల వేస్తున్నారు. వారిని పార్టీలో చేర్చుకోవడానికి కోట్ల ఆఫర్ ఇస్తున్నారట. అలాగే సర్పంచ్, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, ఎంపీపీ, మున్సిపల్ కౌన్సిలర్లు…ఇలా చిన్న చిన్న పదవులు ఉన్నవారిని సైతం పార్టీలు వదలడం లేదట. ఎవరికి వారిని డబ్బులు కొనేయాలని చూస్తున్నాయట. ఇప్పటికే వారి కోసం కోట్లు ఖర్చు పెట్టేందుకు చూస్తున్నారు. ఇక ఇదే పరిస్తితి కొనసాగితే..ఎన్నికల నాటికి పార్టీలు ఎంత ఖర్చు పెడతాయో చెప్పాల్సిన పని లేదు. ఇక ఖర్చులో హుజూరాబాద్ ని మునుగోడూ క్రాస్ చేసేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news