మోకాళ్ల నొప్పులకు మస్టడ్‌ ప్యాక్..ఇలా చేస్తే సూపర్‌ రిజల్ట్..!

-

కాస్త ఏజ్‌ రాగానే.. మోకాళ్లనొప్పులు రావడం అందరికి జరుగుతుంది. జాయింట్‌ పెయిన్స్‌తో యూత్‌ కూడా ఇబ్బంది పడుతుంటారు. దీనికోసం.. పెయిన్‌ కిల్లర్స్‌, జెల్స్‌ వాడుతుంటారు. నడి వయసునుంచే ఇలా టాబ్లెట్‌ వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.. మరి అలాంటి వారికి.. నాచురల్గా ఉపశమనం కలిగించడానికి ఓ మంచి పద్ధితి ఉంది. అదే మస్టర్డ్‌ ప్యాక్‌. ఆవాలతో వేసే ఈ ప్యాక్‌ వల్ల నొప్పులన్నీ దెబ్బకి మాయం అవుతాయట. మరి అది ఎలా చేయాలో చూద్దామా..!

మోకాళ్ల నొప్పులకు ఆవాల ప్యాక్‌ ఎలా చేయాలంటే..

ఆవాలను ఒకటిన్నర స్పూన్‌ తీసుకుని రెండు గ్లాసులు నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టి మరిగించాలి. ఎంతలా మరగాలంటే.. రెండు గ్లాసులు నీళ్లు కాస్త ఒక గ్లాస్‌ నీళ్లు అవ్వాలి. అప్పుడు ఒక కాటన్‌ క్లాత్‌ తీసుకుని.. మోకాలికి సరిపడా క్లాత్‌ కట్‌ చేసుకుని ఈ మరిగిన నీళ్లు మీరు ఎంత వేడి వరకూ భరించగలరో అంత వేడి ఉంచుకుని అందులో ఈ క్లాత్‌ ముంచి మోకాలి భాగంలో చుట్టేయండి. వేడి కాస్త తగ్గినప్పుడు మరిగిన నీళ్లు పైపైన చల్లండి. ఇలా 15- 20 నిమిషాల పాటు ఉంచుకోండి. షోల్డర్‌ జాయింట్‌ పెయిన్స్‌కు, పిక్కల భాగంలో పెయిన్‌కు ఇలాంటి ప్యాక్‌ బాగా ఉపయోగపడుతుంది. నడుము నొప్పి ఉన్నవారికి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది.

ఆవాల్లో పెయిన్స్‌ తగ్గే మెడిసిన్స్‌కు ఈ వేడి తగలడం వల్ల మజిల్స్‌ రిలాక్స్‌ అయి పెయిన్‌ తగ్గిస్తాయి. పెయిన్‌కు కారణమయ్యే రిసప్టార్స్‌ను కూల్‌ చేస్తాయి. ఇది పరిశోధన చేసి మరీ.. మంచి ఫలితం ఉందని నిరూపించారు.

ఈ ప్యాక్‌ను నొప్పులున్న వారు ఏ వయసు వారైనా వేసుకోవచ్చు.. అయితే ఒక్కటే విషయం.. మనం నీళ్లు బాగా మరిగించాం కదా.. అలా కాలే కాలే నీళ్లను వేసుకోవద్దు. చూసుకుని వేడి కంట్రోల్‌లోకి వచ్చాకే అప్లై చేసుకోవాలి.

ఇంకా రిలీఫ్‌ కావాలంటే.. గానుగఆడించిన ఆవనూనె తీసుకుని అందులో కాస్త ముద్దకర్పూరం వేసుకుని పెయిన్‌ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి.. అప్పుడు ఈ ప్యాక్‌ వేస్తే.. మంచి ఉపశమనం ఉంటుంది.. పెయిన్‌ కిల్లర్స్‌ వాడే బదులు కాస్త శ్రమ అయినా ఈ పద్దతి ఫాలో అయితే ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news