39 మంది సిట్టింగ్ ఎంపీలకు నో టికెట్.. లక్షల మెజార్టీతో గెలిచినా నోయూజ్

-

ఇస్ బార్ 400 పార్ అంటూ బీజేపీ మొదటి నుంచి నినదిస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో కనీసం 370 సీట్లు కుదిరితే 400 స్థానాల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే పక్కా వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తోంది. గెలుపు గుర్రాలను బరిలోకి దింపి కార్యాచరణ షురూ చేసింది. ఈ క్రమంలోనే బలమైన నేతలను రంగంలోకి దింపింది. మరోవైపు చాలా మంది సిట్టింగులకు మొండిచేయి చూపింది.

ఉత్తర భారత దేశంలో బలంగా కనిపిస్తున్న బీజేపీ..సిట్టింగ్‌లను భారీ సంఖ్యలో మార్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో లక్షల మెజారిటీతో గెలిచిన అభ్యర్థులను కూడా పక్కన బెట్టేసింది. గత ఎన్నికల్లో లక్ష నుంచి 6 లక్షల వరకు మెజారిటీతో గెలుపొందిన 39 మంది అభ్యర్థులకు మొండిచేయి చూపింది. ప్రజా జీవితంలో నిర్లక్ష్యంగా ఉన్నవారిని, అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మాటలు, చేతలతో పార్టీకి చెడ్డపేరు తెచ్చిన వారిని ఈ సారి పక్కనబెట్టింది. ప్రధానీ నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో 9 మంది సిట్టింగ్‌లను ఇంటికి పంపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version