అస్సాం, మేఘాలయ రాష్ట్రాల మధ్య చారిత్రాత్మక ఒప్పంద కుదిరింది. గత 50 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సరిహద్దు వివాదానికి స్వస్తి పలికాయి ఇరు రాష్ట్రాలు. ఈ రెండు ఈశాన్య రాష్ట్రాల మధ్య గత 50 ఏళ్ల నుంచి సరిహద్దు వివాదం ఉంది. తరుచుగా ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఘర్షణకు దారి తీస్తోంది. తాజాగా ఈ రోజు జరిగిన ఒప్పందంతో సరిహద్దు వివాదం దాదాపుగా సమిసిపోయినట్లు అయింది. ఢిల్లీలో కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మాలు ఇద్దరు ఒప్పందంపై సంతకం చేశారు. ఇది చాలా చారిత్మాత్మకమైన రోజని, ఈశాన్య రాష్ట్రాలు భారతదేశ వృద్ధి ఇంజిన్‌గా మార్చేందుకు కృషి చేస్తాం అని హిమంత బిశ్వ శర్మ అన్నారు.
అస్సాం, మేఘాలయ మధ్య చారిత్రాత్మక ఒప్పందం… 50 ఏళ్ల సరిహద్దు వివాదానికి స్వస్తి
-