గుండెపోటుతో టెన్త్ క్లాస్ విద్యార్థి మృతి

-

ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అందరిలోనూ గుండెపోటు వస్తోంది. జీవనశైలిలో మార్పులు.. తీసుకుంటున్న ఆహారం వల్ల ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అప్పటి దాకా ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్లు అకస్మాత్తుగా కుప్పకూలుతున్నారు. గుండెపోటుతో టెన్త్ క్లాస్ విద్యార్థి మృతి చెందాడు.

Class X boy dies of heart failure a day after his birthday in Rajasthan

ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రం దౌసాలో ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువు తున్న యతేంద్ర ఉపాధ్యాయ్ (16) క్లాసులోకి వెళ్తుండగా గుండెపోటుతో కుప్పకూలాడు.. సిబ్బంది ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్న మరు సటి రోజే ఇలా జరగడం తో కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. ఇక ఈ సంఘటనపై పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version