2024 టెట్ లో అర్హత సాధించిన వారికి డీఎస్సీ దరఖాస్తు ఉచితం

-

టీజీ టెట్-2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు విడుదల చేసిన విషయం తెలిసిందే. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. టెట్, డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త వార్త చెప్పారు. టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని అన్నారు. టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు ప్రభుత్వం కల్పిస్తుందని గుడ్ న్యూస్ చెప్పారు. అంతేకాకుండా.. టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించినట్లు వెల్లడించాడు. దీంతో టెట్, డీఎస్సీ విద్యార్థులకు ఇది ఆనందించే వార్తే అని తెలిపారు. విద్యార్థులు ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

టీజీ టెట్ -2024కు 2,86,381 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. అర్హత సాధించిన 57,725 అభ్యర్థులు కాగా.. పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13% కాగా.. పేపర్-2లో 34.18% అర్హత సాధించిన వారు https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లో ఫలితాల అందుబాటులో ఉంచారు. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% అర్హత శాతం పెరిగింది. 2023తో పోలిస్తే పేపర్-2లో 18.88% అర్హత శాతం పెరిగిందని సీఎం రేవంత్ అన్నారు. టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదన్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించింది. టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version