‘హిమాచల్‌’ ఎన్నికల రాజకీయం .. బీజేపీలోకి ఆరుగురు ఎమ్మెల్యేలు

-

హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. వీరంతా అనర్హత వేటు పడిన వారు కావడం గమనార్హం. కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ నేతృత్వంలో ఇవాళ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో వీరు కమలం గుర్తుపై పోటీ చేయనున్నట్లు సమాచారం.

బీజేపీలో చేరిన వారిలో సుధీర్‌ శర్మ, రవి ఠాకూర్‌, రాజీందర్‌ రాణా, ఇందర్‌ దత్‌ లఖన్‌పాల్‌, చేతన్య శర్మ, దేవిందర్‌ కుమార్‌ భుట్టో ఉన్నారు. గత నెల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వీరంతా పార్టీ విప్‌ను ధిక్కరించి బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఫిబ్రవరి 29వ తేదీన వీరిపై స్పీకర్‌ అనర్హత వేటు వేశారు. వీరితో పాటు దవులకు రాజీనామా చేసిన మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సైతం త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ తన హామీల అమల్లో విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్‌ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version