నాలుగోసారి ఆడపిల్ల పుట్టిందని.. పసికందును చంపిన తల్లి!

-

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. మానవత్వం మంటగలిపే అమానవీయ ఘటన చోటుచేసుకుంది. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి కసాయిగా మారింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బిడ్డను ఏకంగా గొంతునులిమి దారుణంగా హత్య చేసింది. అనంతరం బిల్డింగ్ మీద నుంచి కిందకు విసిరేసింది. ప్రస్తుతం ఈ దారుణమైన ఘటన ఢిల్లీ ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేసింది. పూర్తివివరాల్లోకివెళితే..

ఆరు రోజుల ఆడ శిశువుకు చనుబాలిస్తూనే తల్లి శివాని పసికందు గొంతునులిమి హత్య చేసింది. వరుసగా నాలుగోసారి ఆడపిల్ల పుట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే, కన్న బిడ్డను హత్యచేసిన అనంతరం శిశువు కనిపించడం లేదని శివాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆమె ప్రవర్తన కాస్త వింతగా కనిపించడంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారించి అసలు విషయాన్ని రాబట్టారు. చివరకు కంటతడి పెట్టుకున్న శివాని నిజాన్ని అంగీకరించింది.దీంతో ఆమెను రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన దేశరాజధానిలో హాట్ టాపిక్‌గా మారింది.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version