వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే పెట్రోల్ మరియు డీజిల్ దగ్గర సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. ఇండియా వ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వంద రూపాయలు దాటాయి.
కొన్నిచోట్ల పెట్రోల్ ధర 120 రూపాయలు కూడా ఉంది. గత పాలనలో ఎక్కడా కూడా… ఇలా రేట్లు పెరగలేదు. ఇలాంటి నేపథ్యంలో… కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక ప్రకటన చేశారు. చమురు కంపనీలు లాభాలలోకి వస్తున్నాయని… పెట్రోల్ మరియు డీజిల్ ధరలు త్వరలో తగ్గిందని ఆయన వెల్లడించారు. మరో పది రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. అయితే ఆయన ప్రకటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో… కేంద్రం ఇలాంటి ప్రకటన చేస్తుందని అంటున్నారు.