ఎన్నికల్లో విజయం సాధిస్తే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. అందుకు అనుగుణంగా అనేక పథకాలను కూడా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.కానీ తాజాగా పథకాల అమలు, పేర్లు కొనసాగింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. 2019 ఏడాదికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లయితే వాటికి పాత పేర్లను పెట్టాలని నిర్ణయించింది.
2019 – 24 మధ్య ప్రవేశపెట్టిన కొత్త పథకాలకు మంత్రి డొలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశాల మేరకు పేర్లని మారుస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అదేవిధంగా పార్టీల రంగులు, జెండాలతో ఉన్న పాసుపుస్తకాలు, లబ్ధిదారుల కార్డులు సర్టిఫికెట్లు జారీని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
పేర్లు- మార్చిన తర్వాత పథకాల పేర్లు ఇలా…
జగనన్న విదేశీ విద్యా దీవెన-అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి
జగనన్న విద్యా దీవెన వసతి దీవెన – పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్
వైఎస్సార్ కల్యాణమస్తు-చంద్రన్న పెళ్లికానుక
వైఎస్సార్ విద్యోన్నతి-ఎన్టీఆర్ విద్యోన్నతి
జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం-ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్