సాగర్ టికెట్ విషయంలో ఏమీ తేల్చుకోలేకపోతున్న తెలంగాణ బీజేపీ

-

దుబ్బాక ఎన్నికల్లో విజయం సాధించి, గ్రేటర్ లో సైతం సత్తా చాటి దూకుడు మీద ఉన్న బీజేపీ.. నాగార్జునసాగర్‌లోను దానిని రిపీట్ చేయాలని వ్యూహలు రచిస్తోంది. సాగర్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని బరిలో దించి జెండా ఎగురవేయాలని చూస్తోంది. జానారెడ్డి కాంగ్రెస్‌ నుంచే పోటీ చేస్తుండడం టీఆర్‌ఎస్‌ ఏమో చనిపోయిన నరసింహయ్య కుమారుని రంగంలోకి దింపుతుండడం చూసిన బీజేపీ నాయకులు.. ఆ రెండు పార్టీలకు ధీటుగా ఉండే అభ్యర్థి కోసం వెతుకుతున్నారు.

అయితే బీజేపీ నాగార్జున సాగర్ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా తేలలేదు. ఎవరికి ఇవ్వాలో అనే అంశం కమలం పార్టీ తేల్చుకోలేక పోతోంది. టీఆర్ఎస్ నుంచి ఒక నేత వస్తాడని ఎదురు చూస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. మధ్యాహ్నానికి ఈ అంశం మీద క్లారిటీ రానున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ సీటు కోసం పలువురు బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆలస్యం చేయడం బీజేపీకి నష్టం అనే అభిప్రాయం తో పార్టీ శ్రేణులు ఉన్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version