ప్రతీ వెధవ, సన్నాసి చేతనేను ఇవాళ మాటలు పడుతున్నా : పవన్‌

-

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన యువశక్తి సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఇవాళ తిట్టడానికి ఈ సభ పెట్టలేదని, తనకున్నదల్లా సగటు మనిషి తాలూకు ఆలోచనే అని స్పష్టం చేశారు. “ఈ దేశం నాకు ఎందుకు సహకరించదు, ఎందుకు నాకోసం నిలబడదు అని ప్రతి సగటు మనిషిలోనూ కోపం ఉంటుంది. నేను కూడా అలాంటి సగటు మనిషినే. నాలోనూ అలాంటి ప్రశ్నలే తలెత్తాయి. నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నా గురించి నేను చేసిన పోరాటం అంటే తొలిప్రేమ నుంచి ఖుషి సినిమా వరకు మాత్రమే.

 

నాకు కోరికలు లేవు. ఇంకా పెద్ద స్టార్ అవ్వొచ్చేమో, ఇంకా డబ్బులు రావొచ్చేమో, ఇంకా కృషి చేస్తే జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పేరు రావొచ్చేమో అని ఖుషీ తర్వాత అనిపించింది. కానీ నాలో ఏదో అశాంతి. అంత స్థాయికి చేరినా కూడా నాలో సంతోషం కలగలేదు. అన్ని విజయాలు సాధించినా, కోట్ల మంది ప్రజలు జేజేలు పలుకుతున్నా నాలో అశాంతికి కారణం ఏంటో నాకు అర్థం కాలేదు. అయితే, నా మనసు… బాధల్లో ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తోందని తెలుసుకున్నాను. ఆ కష్టమే నన్ను ఆనందంగా ఉండనివ్వలేదు.

ఇవాళ ప్రతి సన్నాసి చేత, ప్రతి వెధవ చేత మాటలు అనిపించుకుంటుంటే నాకేమీ బాధగా లేదు. ఇలాంటి వెధవలు, ఇలాంటి సన్నాసులతో మాట అనిపించుకోకుండా బతికేయగలను… నా చేతుల్లో ఆ జీవితం ఉంది. రాజకీయాల్లోకి రాకపోతే ఇలాంటి సన్నాసులు నా పక్కన నిలబడిఫొటోలు కూడా తీయించుకుంటారు. నాకు తిట్టించుకోవడం ఓకే… ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడుతున్నప్పుడు తిట్టించుకోవడం నాకేమీ బాధ కలిగించదు. మన కోసం మనం జీవించే జీవితం కంటే కూడా సాటి మనిషి కోసం జీవించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. సినిమాల్లో కష్టాలు రెండున్నర గంటల్లో తీర్చగలను, కానీ నిజజీవితంలో ఉద్దానం వంటి కష్టాన్ని ఈ రోజుకీ తీర్చలేను. ఇవన్నీ చూసి, విభజన సమయంలో పరిస్థితులు చూసి
రాజకీయాల్లోకి వచ్చాను.

 

Read more RELATED
Recommended to you

Latest news