మొదటి ప్రయత్నంతోనే ఉప్పెన సినిమా ద్వారా డైరెక్టర్ గా తనని తాను ప్రూవ్ చేసుకున్న సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఎన్టీఆర్ కి పెద్ద వీరాభిమాని.. ఎప్పటికైనా సరే తన సినీ కెరియర్ లో ఎన్టీఆర్ తో సినిమా చేయాలనే తపనతోనే ఇంకా కొనసాగుతూ ఉన్నానని గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా తెలియజేశారు. ఇక ఎట్టకేలకు బుచ్చిబాబు సన ప్రయత్నం ఫలించిందని చెప్పవచ్చు . ఇక ఎన్టీఆర్ ఆయనను పిలిపించి మరి సినిమా చేద్దామని చెప్పారట. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడని.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక కూడా పూర్తయింది అనే విషయాలు ఎప్పటికప్పుడు అధికారికంగా వినిపిస్తున్నాయి. కానీ కొరటాల శివ ఆచార్య సినిమా ఫలితం చూసిన ఎన్టీఆర్ కాస్త వెనుక తొక్కులు తొక్కుతున్నాడు అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కొరటాల శివ లెక్క సరిగ్గా కుదరకపోవడం వల్లే ఆచార్య సినిమా డిజాస్టర్ అయిందని, ఇక మరొకసారి కూర్చొని పూర్తిస్థాయిలో కథను సిద్ధం చేస్తున్నారట ఎన్టీఆర్. అలాగే ఎన్టీఆర్ చెప్పిన కొన్ని విషయాలను కూడా కథలో జోడిస్తున్నట్లు సమాచారం.
ఇక ముందుగా ఎన్టీఆర్ చెప్పినట్టు కొరటాల శివ జూన్లో ఈ సినిమాను మొదలుపెట్టాలి. ఇందుకోసం తారక్ ఇంటి దగ్గర ఒక ప్రత్యేకమైన సెట్ ను కూడా వేశారు. కానీ వర్షం కారణంగా సెట్ దెబ్బ తినడం.. మరోవైపు కథ విషయంలో కూడా కొరటాల శివకు కొన్ని డౌట్స్ ఉన్నాయని అందుకే సినిమా ఆలస్యం అవుతుందని సమాచారం. ఇకపోతే ఇంకొన్ని రోజుల గ్యాప్ వరకు ఈ సినిమా మొదలయ్యే అవకాశం లేదు కాబట్టి ఈ ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా బుచ్చిబాబు సనా సినిమాను ఎన్టీఆర్ ముందుకు తీసుకొచ్చారని అంటున్నారు. ఇప్పటికే తన కథను ఎన్టీఆర్ కి ఒక పాయింట్ గా చెప్పారని , కథ నచ్చడంతో షూటింగ్లో పాల్గొనడానికి ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నారని, సుకుమార్ ను బుచ్చిబాబు కలిసి ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ వినిపించి తుది మెరువులు కూడా నోట్ చేసుకున్నాడు అని సమాచారం. ఇక దీన్ని బట్టి చూస్తే బుచ్చిబాబు సినిమా అయిన తర్వాతనే కొరటాల శివకు అవకాశం లభిస్తుందని టాక్.