Bigg Boss: రాజ్యం కోసం కుస్తీ పోటీ.. రాజ్యాన్ని గెలిచే వారెవ‌రో ? విశ్వ‌ విశ్వ‌రూపం.. నాణేలు కాజేసిన జేస్సీ

-

Bigg Boss: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్న రియాల్టి షో బిగ్‌ బాస్‌. రోజులు గడిస్తున్న కొద్దీ.. ఈ షో ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ విజ‌య‌వంతంగా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఈ రియాలిటీ షోకు రోజురోజుకూ అభిమానుల సంఖ్య అనూష్యంగా పెరుగుతుంది. టీఆర్పీ కూడా రికార్డు స్థాయిలో న‌మోదు అవుతుంది. బిగ్‌బాస్‌.. గేమ్ అదుర్స్ అని చెప్పాలి. స్నేహంగా ఉన్న‌ఇంటి స‌భ్యుల మ‌ధ్య గొడ‌వ‌లు చెలరేగేలా టాస్కులు, దూరదూరంగా ఉన్న‌ కంటెస్టెంట్ల మ‌ధ్య ప్రేమలు చిగురించేలా ల‌వ్ ట్కాస్‌లు, కడుపుబ్బ న‌వ్వించే టాస్కులు. అన్ని రకాల ఎమోషన్స్‌తో క‌లిసి ఉన్న‌ బిగ్‌బాస్ షో.. బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కు ఫుల్‌ మీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది.

ఇదిలా ఉంటే.. 19 మంది కంటెస్టెంట్ల‌తో ప్రారంభ‌మైన ఈ షోలో నాలుగు వారాలు గ‌డిసే స‌రికి నలుగురు ఎలిమినేట్ అయ్యి 15 మంది కంటెస్టెంట్‌లు ఉన్నారు. ప్రేక్ష‌కుల‌ను అట్రాక్ట్ చేయ‌డానికి బిగ్ బాస్ టాస్కులు మాములుగా ఉండ‌వు. చాలా కూల్ గా , ఫ‌న్నీగా, ఎంతో రొమాంటిక్ గా షో సాగుతుందే అనుకునే లోపే.. ర‌చ్చ లేపడానికి బిగ్‌బాస్ ట్రై చేస్తాడు.

అన్యూనంగా ఉన్న‌వారి మ‌ధ్యే చిచ్చు పెడుతాడు. ఈ రోజు ఎపిసోడ్‌లో కూడా యుద్దానికి తెర తీసిన‌ట్టు క‌నిపిస్తుంది. కెప్టెన్సీ టాస్క్ పేరులో హౌస్‌ను కుస్తీ పోటీల వేదికగా మార్చేసిన‌ట్టు క‌నిపిస్తుంది. మాట‌ల‌తోనే కాదు .. ఈ సారి చేతుల‌కు కూడా ప‌ని పెట్టిన‌ట్టు క‌నిపిస్తుంది. తాజాగా విడుద‌లైన ప్రోమో ప్ర‌కారం..

కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ‘రాజ్యానికి రాజయ్యేది ఎవరు.?’ అనే టాస్క్‌ను నిర్వహించినట్లు అర్థమవుతోంది. ఈ టాస్క్‌లో ర‌వి, సన్నీలను రాజులుగా నియమించి సన్నీ ప్రజా.. రవి ప్రజా అంటూ రెండు జట్లుగా ఇంటి సభ్యులు పాల్గొనట్టు తెలుస్తుంది. ఈ టాస్క్‌లో భాగంగా రవి, సన్నీలు రాజుల గెటప్‌లో కనిపించారు. యాంకర్ రవి తరపున విశ్వా.. సన్నీ తరపున మానస్ లు కుస్తీ పోటీలో పాల్గొననున్నట్లు క‌నిపిస్తుంది.

ఇదిలాఉంటే.. టాస్క్‌ ప్రారంభానికి ముందు ఇరు జ‌ట్ల‌కు బిగ్ బాస్ కొన్ని నాణేలు ఇచ్చారు. కానీ, కుస్తీ పోటీ జ‌రుగుతున్న..సమయంలోనే ష‌ణ్ముఖ్ , జెస్సీ, సిరిలు పెట్టేలో ఉన్న నాణేలను కాజేసిన‌ట్టు తెలుస్తుంది. దొంగతనం విషయం తెలిసిన విశ్వా.. ఇంటిస‌భ్యుల మీద అరుస్తాడు. దమ్ముంటే ముందుకొచ్చి ఆడాలి. కానీ, ఈ దొంగ బుద్ధులు ఏంటి అంటూ ఫైర్ అయ్యాడు.

http://<iframe width=”640″ height=”360″ src=”https://www.youtube.com/embed/XA2oS-Aa_Mo” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>

ఈ కెప్టెన్ టాస్క్ లో భాగంగా ష‌న్ను, సిరి, జెస్సి, మానస్, లోబోలు స‌న్నీ టీంలో, శ్రీరామ్ చంద్ర, హమీదా, ప్రియాంక సింగ్, ఆర్జే కాజల్ యాంక‌ర్ ర‌వి మ‌రో టీంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ సోమవారం నామినేషన్ వేడి చల్లారక ముందే కెప్టెన్సీ టాస్క్ తో మరోసారి ఇంటి సభ్యుల మధ్య మంటలు పుట్టించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version