టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి వ్యవహారం సంచలనగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. తాజాగా ముగ్గురు నిందితులను కస్టడిలోకి తీసుకున్నారు సిట్ అధికారులు. వారికి కింగ్ కోటి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం నిందితులు ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యలను సిట్ ఆఫీసుకి తరలించారు. నిందితులను ఈనెల 6వ తేదీ వరకు విచారించనున్నారు సిట్ అధికారులు.
అలాగే వారి ఆర్థిక లావాదేవీల పైన దృష్టి పెట్టనుంది సీట్. ఇక ఈ కేసులో ఇప్పటికే ఈడీ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ కేసులో ఈసీఐఆర్ నమోదు చేసింది. జైల్లో ఉన్న నిందితులను కస్టడీలోకి తీసుకునే ఆలోచనలో ఈడి ఉంది. అలాగే విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాసిన వారిపై ఈడి దృష్టి సారించింది.