ఎలక్షన్స్ వేళ ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ

-

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి, ఇప్పటికే ఎన్నికల ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్అయింది.తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో మే 13న ఎన్నికలు జరుగున్నాయి.ఎన్నికల షెడ్యూలు విడుదల అవడంతో దేశవ్యాప్తంగా కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు.

 

పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల సెలవులపై నిషేధం విధిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే అంతా వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ సెలవులు రద్దు చేశారు. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే మాత్రం 2 రోజుల వరకు అనుమతించేందుకు కార్యాలయ అధికారికి అధికారం ఉంటుంది. అంతకంటే ఎక్కువ రోజులు కావాలంటే పై అధికారులు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.హెల్త్ కి సంబంధించిన ఇబ్బందులు వస్తే ప్రభుత్వ ఉద్యోగి దరఖాస్తుతో పాటు మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ జతచేసి ఇవ్వాల్సి ఉంటుంది.కార్యాలయ అధిపతి ద్వారా జిల్లా ఎన్నికల అధికారి సమర్పించితే ఆయన అనుమతితో సెలవు తీసుకోవచ్చు. ఎలక్షన్స్ కి సంబందించిన ఆర్డర్లు, మెయిల్స్ .. ఇతర సమాచారం అందించేందుకు అన్ని గవర్నమెంట్ ఆఫీసులు సెలవు రోజుల్లో కూడా పని చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version