పాకిస్తాన్ డిగ్రీలు ఇండియాలో చెల్లవు, ఉద్యోగాలు రావు…. యూజీసీ, ఏఐసీటీఈ ప్రకటన

-

ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ లో విద్యనభ్యసించే భారతీయ విద్యార్థుల డిగ్రీలు చెల్లుబాటు కావని.. ఎవరూ కూడా పాకిస్తాన్ లో ఉన్నత చదువులను అభ్యసించవద్దని సూచించింది. పాకిస్తాన్ విశ్వవిద్యాలయాల్లో చేసే కోర్సులు భారత్ లో చెల్లుబాటు కావని విద్యార్థులకు స్పష్టం చేశారు. ఉన్నత విద్య కోసం పాకిస్తాన్ ఎవరూ వెల్లవద్దని సూచించింది. పాకిస్తాన్ లో చదివిన డిగ్రీలతో ఇండియాలో ఉద్యోగాలు రావని స్పష్టం చేసింది. యూనియన్ గ్రాంట్ కమిషన్( యూజీసీ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) సంయుక్తంగా ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్తాన్ వలస వెళ్లిన వారు, వారి పిల్లలు భారత పౌరసత్వం ఉన్నవారి డిగ్రీలు కేంద్ర హెంశాక అనుమతితో పరిగణలోకి తీసుకుంటామని తెలిపాయి. అయితే ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్లి చదువుకునే వారి సంఖ్య చాలాచాలా తక్కువ. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇక్కడి వారు అక్కడికి వెళ్లి విద్యను అభ్యసిస్తుంటారు. అయినా కూడా భద్రతా కారణాలతో యూజీసీ, ఏఐసీటీఈ ఈ నిర్ణయం తీసుకున్నాయి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news