తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు..!

-

తల్లిదండ్రులు తమకు నచ్చినట్లుగా అనుసరించకూడదు. నిజానికి కొంత మంది తల్లిదండ్రులు చేసే తప్పులు వల్ల పిల్లలు కూడా తప్పులు చేస్తున్నారు. మంచి ఏమిటి అనేది నేర్చుకోవడం లేదు. తల్లిదండ్రులు ని చూసి వాటిని ఫాలో అవ్వడం, అదే మంచి పద్ధతులు అనుకోవడం జరుగుతోంది. నిజానికి తల్లిదండ్రులు పిల్లలని సద్గుణాలతో పెంచాలని ఆచార్య చాణక్య చెప్పారు.

 

చాణక్య నీతి లో పిల్లల్ని ఎలా పెంచాలి అనేది కూడా చాణక్య చెప్పారు. అయితే మంచిగా సద్గుణాల తో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచితే వాళ్ల భవిష్యత్తు బాగుంటుంది. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. చెడు నేర్పితే పిల్లలు మనసులో ఎప్పుడూ తప్పుడు ఆలోచనలు మాత్రమే కలుగుతాయి.

అలా కలగకుండా ఉండాలంటే తల్లిదండ్రుల ప్రవర్తన బాగుండాలి. అలానే మీ సొంత ప్రయోజనాలు తీర్చుకోవడానికి పిల్లలతో అబద్ధాలు చెప్ప్పించద్దు. మీరు కనుక వాళ్ళ చేత అబద్ధం చెప్పిస్తే వాళ్ళకి అది అలవాటైపోతుంది. అలానే పిల్లలు చదువు విషయంలో కూడా మీరు శ్రద్ధ తీసుకోవాలి అలానే ఎక్కువ గారాభం చేయకూడదు. గారాభం చేస్తే పిల్లలు చెడి పోతారు కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పెంపకం లో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పిల్లలు అనవసరంగా తప్పు దారిన వెళ్తారు. కనుక చాణక్య చెప్పిన విధంగా అనుసరించి మంచిని మీ పిల్లలకి నేర్పి మంచి దారి లో వెళ్లేలా చెయ్యండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version