‘అసెంబ్లీ’లోకి పవన్ ఎంట్రీ..టీడీపీ హెల్ప్?

-

ప్రజా సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్…ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే…ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని రాష్ట్ర సమస్యలని ఎత్తిచూపుతూనే ఉన్నారు. అలాగే పవన్ చేసే పోరాటాలకు ప్రజల నుంచి కూడా మద్ధతు బాగానే వస్తుంది. అయితే ఇలా ప్రజల కోసం పోరాటం చేస్తున్న పవన్ అసెంబ్లీలో ఉంటే బాగుండేది అని…జనసేన శ్రేణులు ఎప్పుడు అనుకుంటూనే ఉంటున్నారు.

అసలు పవన్ ఒక్కరూ అసెంబ్లీలో ఉంటే రాజకీయంగా వేరుగా ఉండేదని భావిస్తూ ఉంటారు. కానీ గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం ప్రజలు పవన్ ని అసెంబ్లీకి పంపించలేదు. అనూహ్యంగా ఆయన్ని ఓడించారు..అయితే ఈ సారి ఖచ్చితంగా పవన్ గెలిచి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇస్తారని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. ఇక ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారో కూడా ఆ పార్టీ శ్రేణులు చెప్పేస్తున్నాయి. ఈ సారి పవన్ ఒక్కచోట నుంచే పోటీ చేస్తారని, అది కూడా భీమవరం నుంచే బరిలో దిగుతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

జనసేన శ్రేణులు చెప్పడమే కాదు…అధికారికంగా ఉందా పవన్…భీమవరం నుంచి పోటీ చేస్తారని ప్రకటన వచ్చింది. పవన్ కల్యాణ్.. భీమవరం నుంచి పోటీ చేస్తారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ప్రకటించారు. ఇలా సీటు దాదాపు ఫిక్స్ అయిన నేపథ్యంలో ఈ సారి ఆయన భీమవరం నుంచి విజయం సాధిస్తారా? అంటే ఇప్పుడే చెప్పలేని పరిస్తితి ఉంది…ప్రజల్లో కాస్త మార్పు మాత్రం కనిపిస్తుంది గాని..అది ఎన్నికల సమయంలో ఏం అవుతుందో చెప్పలేం.

ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే విజయం కోసం పవన్ శ్రమించాల్సి ఉంటుందని, అదే టీడీపీతో పొత్తు ఉంటే పవన్ విజయం నల్లేరు మీద నడకే అని విశ్లేషకులు అంటున్నారు. భీమవరం కాకపోయిన ఎక్కడ పోటీ చేసిన కళ్ళుమూసుకుని గెలిచేస్తారని అంటున్నారు…అసలు గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటే పవన్..గాజువాక, భీమవరంలో గెలిచే వారని చెబుతున్నారు.

ఆ రెండు చోట్ల టీడీపీ మూడో స్థానానికి పరిమితమైంది గాని…ఓట్లు మాత్రం బాగా తెచ్చుకుంది…భీమవరంలో పవన్ 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోతే..అక్కడ టీడీపీకి 54 వేల ఓట్లు పడ్డాయి. గాజువాకలో 4వేల ఓట్ల తేడాతో ఓడిపోతే..టీడీపీకి 56 వేల ఓట్లు పడ్డాయి. అంటే టీడీపీ కలిస్తే పవన్ కు గెలుపు మాత్రమే కాదు…భారీ మెజారిటీ కూడా వస్తుందని అర్ధమవుతుంది. మొత్తానికి టీడీపీతో పొత్తు ఉంటే పవన్ గెలిచి అసెంబ్లీలో ఎంట్రీ ఇవ్వడం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news