ఇకనైనా రహదారి భద్రతా చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి : పవన్ కల్యాణ్

ఇకనైనా రహదారి భద్రతా చర్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. గత రాత్రి ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలో జరిగిన ఆటో ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. కూలీనాలీ చేసుకుని బత్తలపల్లి గ్రామం నుంచి ధర్మవరం వస్తున్న వీరు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోవడం శోచనీయం అని పేర్కొన్నారు. వారికి బస్సు సౌకర్యం ఉండుంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. గ్రామాల నుంచి పట్టణాలకు రావడానికి సరైన రవాణా మార్గాలు లేక ఆటోలను ఆశ్రయిస్తున్నారని వివరించారు.

Pawan Kalyan: ముందుచూపు లేకపోతే ఇలాంటి దారుణాలే చూడాల్సి వస్తుంది..  వైసీపీకి పవన్ కల్యాణ్ కౌంటర్ | Janasena Chief Pawan Kalyan Interesting  Comments On Ruling YCP Telugu News | TV9 ...

ఇకనైనా రహదారి భద్రతా చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు రావడానికి తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. గతరాత్రి జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఉదారంగా ఆర్థికసాయం అందించాలని తెలిపారు. నిండు నూరేళ్లు జీవించాల్సిన వాళ్లు హఠాత్తుగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమే కాకుండా, చాలా బాధాకరమని తెలిపారు.