అణువును కూడా ఇరుకున పెడితే.. అణుబాంబవుతుంది.. పవన్‌ అన్‌స్టాపబుల్‌ పార్ట్‌-2 ప్రొమో

-

నట సింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్‌’ రెండో సీజన్ ఫైనల్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ స్ట్రీమింగ్ కావడానికి! జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన ఎపిసోడ్‌తో రెండో సీజన్‌కు ఎండ్ కార్డు వేస్తున్న సంగతి తెలిసిందే. దీనిని రెండు భాగాలుగా వీక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

అయితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఓటీటీ షోలో పాల్గొని దానిలో కూడా రికార్డులు బద్దలు కొడుతున్నారు. మరి ఇందులో పవర్ ఫినాలే గా వచ్చిన ఈ సూపర్ హిట్ ఎపిసోడ్ రెండు పార్ట్స్ గా ప్లాన్ చేయగా మొన్న వచ్చిన పార్ట్ 1 ఎపిసోడ్ రికార్డులు బ్రేక్ చేసింది. ఇక ఇప్పుడు ఆహాలో మరో సూపర్ అప్డేట్ ని ఈ ఎపిసోడ్ పార్ట్ 2 పై అందించారు. పార్ట్ 1 ఎపిసోడ్ తో రికార్డులు బ్రేక్ చేసేలా జాతర జరిగింది పార్ట్ 2 తో కూడా అంతకు మించే ఉంటుందని ఈ ప్రోమోని రిలీజ్‌ చేశారు. ఈ ప్రొమోలో పవన్‌ను మరికొన్ని క్లిష్టమైన ప్రశ్నలను బాలకృష్ణ అడిగారు. అంతేకాకుండా.. టీడీపీలోకి రావచ్చుగా అన్నట్లు వ్యాఖ్య కూడా వినిపించింది. అయితే.. చివరకు అణువును కూడా ఇరుకున పెడితే.. అణుబాంబవుతుంది అని బాలకృష్ణ డైలాగ్‌లో ప్రొమో ఎండ్‌ అయ్యింది. దీంతో ఈ ఎపిసోడ్‌పై మరింత అంచనాలు పెరిగిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news