ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. వాటి ధరలు చూస్తే… సామాన్యుడి గుండె బరువెక్కుతోంది. మొన్నటి ఐదు రాష్ట్రాల ముందు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలు పూర్తి కాగానే.. ధరలు డబుల్ చేసేసింది. అయితే… వాహనదారులకు మరో షాక్ ఇచ్చేందుకు చమురు సంస్థలు సన్నద్ధం అవుతున్నాయి.
ఇండియా లో ఇంధన ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి. అయితే.. అంతర్జాతీయంగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగిం చడం భారంగా మారిందని ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి.
లీటర్ పెట్రోల్ పై రూ.20-25, డీజిల్ పై రూ.14-18 మేర నష్టపోతున్నామని.. తమ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుం ది. కాగా.. ఇవాళ హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 కాగా.. డీజిల్ లీటర్ ధర రూ. 97.82 గా నమోదు అయింది.