దేశ వాణిజ్య వ్యాపారాలకు విశాఖపట్టణం ముఖ్యమైన నగరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రూ.10వేల కోట్లతో విశాఖ వాసుల ఆకాంక్షలను నెరవేర్చుతున్నట్లు తెలిపారు. మౌలిక వసతుల కల్పన ద్వారా దేశాభివృద్ధి సాధిస్తున్నామని… దేశ వికాసంలో ఏపీ కూడా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్టణంలో 5 ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయడంతో పాటు మరో రెండు ప్రాజెక్టులను జాతికి అంకితమిచ్చారు ప్రధాని మోదీ. ప్రియమైన సోదరీ, సోదరులకు నమస్కారం అంటూ ప్రధాని ప్రసంగాన్ని ప్రారంభించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తో పాటు ఆసీనులైన అందరికీ ప్రధాని నమస్కారం చెప్పారు. కొన్ని నెలల క్రితమే విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జన్మదిన వేడుకలు జరుపుకున్న సమయంలో తాను ఇక్కడికి వచ్చినందుకు ఆనందంగా ఉందని చెప్పారు.
భారత వ్యాపారం రంగంలో విశాఖపట్నం ముఖ్య పాత్ర పోషిస్తోందని ప్రధాని అన్నారు. కేంద్ర బిందువుగా మారిందన్నారు. పది వేల కోట్ల ప్రాజెక్టులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే అవకాశం కల్పించిన విశాఖ వాసులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. పథకాలు, మౌళిక సదుపాయాల ద్వారా సులభతర జీవితానికి మార్గం ఏర్పడిందని చెప్పారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడును కలిసినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడేవారన్నారు. వారు రాష్ట్రంపై చూపించే
ప్రేమానురాగాలు కొలవలేనివని కొనియాడారు.