‘కాంతార’ మూవీ చూడనున్న ప్రధాని మోదీ

-

ఇప్పుడు ఎక్కడ చూసినా ‘కాంతార’ సినిమా పేరే వినిపిస్తోంది. సైలెంట్ గా రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ అటు ప్రేక్షకులను అలరిస్తూ ఇటు బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి మూవీ టీమ్ ని అభినందించారు. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా త్వరలోనే ఈ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీని చూడబోతున్నట్లు సమాచారం. దీని కోసం పీఎం కార్యాలయం ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

కన్నడ హీరో , దర్శకుడు రిషబ్ శెట్టి తాను నటించి దర్శకత్వం వహించిన ‘కాంతార’  మూవీ బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది

కర్ణాటక రాష్ట్రంలోని తుళునాడులో ఉన్న ఆచార, సంప్రదాయాల్ని కాంతారలో చక్కగా చూపించారు. అక్కడి ‘భూతకోల’ సంస్కృతిని రిషబ్ శెట్టి మూవీలో కళ్లకి కట్టినట్లు ప్రేక్షకుల ముందుంచాడు. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల నుంచి ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version