పవన్‌ కు మద్దతుగా బన్నీ ఎన్నికల ప్రచారం..

-

పవన్‌ కళ్యాణ్‌కు సపోర్ట్‌ చేస్తూ మెగా ఫ్యామిలీ హీరోలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పటి వరకైతే మెగా ఫ్యామిలీ నుండి ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్షంగా మద్దతు తెలిపింది లేదు.. ఇది వ్యూహాత్మకం కావచ్చు.. అయితే ఎన్నికల ప్రచారంలో విశ్రాంతి లేకుండి బిజీ బిజీగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌కి వడదెబ్బ తాకిన విషయం తెలిసిందే. డీ హైడ్రేషన్‌తో బాధపడుతున్న పవన్‌ను రామ్‌ చరణ్‌ పరామర్శించాడు. ప్రస్తుతం పాలకొల్లులో ప్రచారం చేస్తున్న పవన్‌ని కలిసి పరామర్శించాడు అల్లు అర్జున్‌ .. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నాడు.

డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా, సమయం లేకపోవడంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు పవన్‌. జనసేనపార్టీకి మెగా ఫ్యామిలీ యువ హీరోలు మద్దతు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news