బీజేపీ వైపే తెలంగాణ..షా లెక్కలు.!

-

తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని  బి‌జే‌పి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తుందో చెప్పాల్సిన పని లేదు. రాజకీయంగా రాష్ట్రంలో బలపడుతూ వస్తున్న బి‌జే‌పి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై అధికారం సొంతం చేసుకోవాలని తెగ కష్టపడుతుంది. వాస్తవానికి తెలంగాణలో బి‌జే‌పికి పెద్ద బలం లేదు. గత ఎన్నికల్లో కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. కానీ రాజకీయంగా బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పిల మధ్య జరిగే యుద్ధంతో సీన్ మారిపోయింది.

అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయింది. దీంతో బి‌జే‌పి రేసులోకి వచ్చింది. అలాగే రెండు ఉపఎన్నికల్లో గెలవడం కూడా అడ్వాంటేజ్ అయింది. అప్పటినుంచి రాష్ట్రంలో బి‌జే‌పి డామినేషన్ వచ్చింది. అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీపై దూకుడుగా పోరాటం చేస్తూ ముందుకెళుతుంది. ఇక నెక్స్ట్ ఎలాగైనా అధికారం సొంతం చేసుకోవాలని బి‌జే‌పి ప్లాన్ చేసింది. ఇక తెలంగాణపై కేంద్రం పెద్దలు కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు.  దీంతో రాష్ట్రంలో అధికారం సొంతం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇప్పటికే రాష్ట్ర నేతలతో కలిసి ఢిల్లీ పెద్దలు రకరకాల వ్యూహాలు వేస్తూ ముందుకెళుతున్నారు. కే‌సి‌ఆర్‌ని గద్దె దించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే తెలంగాణలో తమదే అధికారమని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ గా చెబుతున్నారు. తాజాగా కూడా అదే తరహాలో తెలంగాణ ప్రజలు బి‌జే‌పి వైపే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో బి‌జేపి గెలవడం ఖాయమని చెప్పుకొచ్చారు.

అటు కర్నాటకలో కూడా అధికారం సొంతం చేసుకుంటామని  షా అంటున్నారు.  అంటే తెలంగాణలో అధికారం దక్కించుకుంటామనే కాన్ఫిడెన్స్ షాకు ఉంది. కానీ పరిస్తితులు చూస్తే అలా ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో బి‌జే‌పి గెలవడం అంత సులువు కాదు. ఓ వైపు అధికార బి‌ఆర్‌ఎస్ బలంగానే ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సైతం క్షేత్ర స్థాయిలో బలంగా ఉంది. కాబట్టి షా చెప్పినట్లుగా..తెలంగాణ ప్రజలు బి‌జే‌పి వైపు పూర్తిగా లేరనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news