‘బండి’ ముందుండి.. ’మైలేజ్’ పెంచిండు!

-

ఏ పార్టీ అయిన బలపడాలంటే అది లీడ్ చేసే నేతల చేతుల్లోనే ఉంటుంది…బలమైన నాయకుడు ముందుండి నడిపిస్తే..ఏ పార్టీ అయిన బలపడాల్సిందే..రేసులో నిలబడాల్సిందే. ఇప్పుడు తెలంగాణలో బండి సంజయ్ కూడా అదే చేశారు..ఎక్కడో ఒక్క సీటుకు పరిమితమైన పార్టీని రేసులోకి తీసుకొచ్చి..అధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకు తీసుకెళుతున్నారు. మామూలుగా తెలంగాణలో బీజేపీకి పెద్ద బలం లేదు. గతంలో టీడీపీతో కలిసి పోటీ చేసి నాలుగైదు సీట్లు గెలుచుకునేది. అంటే జూనియర్ పార్టీగా ఉండేది.

ఇక గత ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసి బీజేపీ సత్తా చాటలేకపోయింది.. కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. దాదాపు 105 సీట్లలో డిపాజిట్ కోల్పోయింది. ఆఖరికి కిషన్ రెడ్డి లాంటి బడా నేత సైతం ఓడిపోయారు. అంటే కమలం పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి పరిస్తితి నుంచి బలమైన టీఆర్ఎస్ ని ఉపఎన్నికల్లో ఓడించి…జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టి, ఇప్పుడు కేసీఆర్ ని గద్దె దించే సత్తా బీజేపీకి వచ్చిందని విశ్లేషణలు వచ్చేవరకు పరిస్తితి వచ్చిందంటే దానికి కారణం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనే చెప్పాలి.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది…ఇక అదంతా మోదీ గాలి అన్నారు. అయితే ఆ గాలి కాస్త తెలంగాణ మొత్తం వ్యాపింపజేసి….అది గాలి కాదు…బీజేపీ బలం అని నిరూపించే దిశగా బండి సంజయ్ పనిచేస్తున్నారు. గాలి అయితే ఉపఎన్నికల్లో అధికార పార్టీని ఓడించడం సాధ్యం కాదు…కానీ రెండు ఉపఎన్నికల్లో ఓడించారు. అలాగే జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సత్తా చాటారు. అదే కాదు ఇంకా పార్టీ రాష్ట్రమంతా బలపడాలని చెప్పి…బండి పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారు.

ఇక తాజాగా విజయ్ సంకల్ప్ సభని సూపర్ సక్సెస్ చేశారు. అయితే సాధారణంగానే తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయని, అలాగే మోదీ సభ కూడా అలా అలా నడిచిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా కార్యవర్గ సమావేశాలు జరిగాయి..మోదీ సైతం తెలంగాణపై ఫోకస్ పెట్టి, నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక సమావేశాలు ఒక ఎత్తు అయితే…విజయ్ సంకల్ప్ సభ మరో ఎత్తు. అసలు ఈ సభకు పెద్దగా జనం రావడం కష్టమే అని ప్రత్యర్ధులు భావించారు. అలాగే బీజేపీ నేతలు…కష్టపడి జనాలని సభకు తరలిస్తారేమో అని అనుకున్నారు.

కానీ అలా జరగలేదు… మెజారిటీ జనం స్వచ్ఛందంగా వచ్చారని అర్ధమవుతుంది… రెండు లక్షల పైనే కెపాసిటీ ఉన్న పరేడ్ గ్రౌండ్స్ పూర్తిగా జనసంద్రంగా మారిపోయింది…పైగా ప్లేస్ చాలక ముందే గేట్లు మూయడం వలన బయట చాలామంది జనం ఉండిపోయారు. ఇక జనాలని చూసి మోదీనే ఆశ్చర్యపోయారు…అలాగే పక్కనే ఉన్న బండి సంజయ్ భుజం తట్టి..ఏంటీ ఈ జనం అని మెచ్చుకున్నారంటే.. సభ సక్సెస్ అవ్వడం వెనుక బండి కష్టం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. అధ్యక్షుడుగా ముందుండి సభని విజయవంతం చేశారు. అలాగే ఈ సభతో బీజేపీ మైలేజ్ ఓ రేంజ్ లో పెరిగిందని చెప్పొచ్చు. అలాగే సీఎం రేసులో బండి ముందుకొచ్చారని గట్టిగా చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news