బాబుతో బీజేపీ.. మాజీ రైట్ హ్యాండ్ క్లారిటీ ఇచ్చినట్లే?

-

టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారా? అంటే అబ్బో ఇప్పుడు ఏంటో ఎప్పటినుంచో బాబు అదే పనిలో ఉన్నారని చెప్పొచ్చు. ఏదో టైమ్ బ్యాడ్ అవ్వడం వల్ల…2019 ఎన్నికల ముందు బాబు ఆవేశంగా బీజేపీ పొత్తు నుంచి బయటకొచ్చేశారు. ఆ తర్వాత ధర్మపోరాట దీక్షల పేరిట మోడీ, అమిత్ షాలని తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టారు…ఇక ఆ తర్వాత ఏమైందో చెప్పాల్సిన పనిలేదు. నెక్స్ట్ 2019 ఎన్నికల్లో బాబు చిత్తుగా ఓడిపోయారు…జగన్ అధికారంలోకి వచ్చారు. ఇక జగన్…కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉంటున్నారు.

దీంతో చంద్రబాబు అనేక రకాలుగా బీజేపీకి దగ్గరవ్వాలని చూశారు. కానీ బీజేపీ మాత్రం బాబుకు ఛాన్స్ ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ బాబుకు వచ్చిన మంచి అడ్వాంటేజ్ ఏంటి అంటే….అనేక ఏళ్ళు బాబుకు రైట్ హ్యాండ్లు మాదిరిగా పనిచేసిన సుజనా చౌదరీ, సీఎం రమేష్ లాంటి రాజ్యసభ సభ్యులు హఠాత్తుగా బీజేపీలోకి వెళ్లారు. మరి వారిని చంద్రబాబే బీజేపీలోకి పంపించారనే ప్రచారం కూడా వచ్చింది. అయితే ఆ ప్రచారం ఇప్పుడుప్పుడే నిజమయ్యేట్లు కనిపిస్తోంది.

ఇటీవల చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి…అమిత్ షా, మోడీలని కలవడానికి అపాయింట్‌మెంట్లు కోరిన విషయం తెలిసిందే. కానీ అపాయింట్‌మెంట్లు దొరకలేదు. దీంతో బాబు వెనక్కి తిరిగొచ్చేశారు. బాబు వచ్చేశాక అమిత్ షా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇక ఇక్కడ నుంచే సీన్ మారింది. బాబుని దగ్గరకు రానివ్వాలని బీజేపీ కూడా డిసైడ్ అయిందని ప్రచారం మొదలైంది.

ఇదే సమయంలో బాబు మాజీ రైట్ హ్యాండ్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్…టీడీపీతో పొత్తు విషయంపై మాట్లాడుతూ…పొత్తు అనేది తాను గానీ, జీవీఎల్ గానీ మాట్లాడేది కాదు అని, అది తమ పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని, కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని చివరిలో రమేష్ ఓ ట్విస్ట్ ఇచ్చారు..అంటే బీజేపీకి బాబు దగ్గరయ్యారనే చెప్పాలి. మరి చూడాలి రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో?

Read more RELATED
Recommended to you

Exit mobile version