కమలంలో ‘పాలక్’..సీనియర్లకు కీలక స్థానాలు!

-

తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకెళుతున్న బీజేపీ..పార్టీలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది..మిషన్-90 అని టార్గెట్ పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు గెలవడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతుంది. ఇందులో భాగంగా తాజాగా 119 నియోజకవర్గాలకు పాలక్‌లని నియమించింది. రాష్ట్రానికి తాజాగా బీఎల్ సంతోష్ వచ్చి..పాలక్‌లకు దిశానిర్దేశం చేశారు. అయితే ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లు ఉన్నారు.

ఇప్పుడు పాలక్‌లని నియమిచ్చి..బూత్ లెవెల్‌లో పార్టీని బలోపేతం చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే కీలక స్థానాల్లో సీనియర్ నేతలని పాలక్‌లుగా నియమించారు. బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా ఉన్న వరంగల్ తూర్పు స్థానంలో ఈటల రాజేందర్‌ని పాలక్‌గా నియమించారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే ఆ మధ్య ఎర్రబెల్లి ప్రదీప్ రావుని పార్టీలో చేర్చుకుని బీజేపీ దూకుడుగా ముందుకెళుతుంది.

అటు రామగుండం స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పాలక్‌గా పెట్టారు. ఈ స్థానంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బలం ఉంది..ఇక్కడ బీజేపీని గెలిపించే బాధ్యత కోమటిరెడ్డికి అప్పగించారు. శేరిలింగంపల్లి సీటు బాధ్యతలని కిషన్ రెడ్డికి అప్పజెప్పారు. ఇక కుత్బుల్లాపూర్ బాధ్యతలు డీకే అరుణకు, ఎల్లారెడ్డి బాధ్యతలు రఘునందన్ రావుకు, కల్వకుర్తి – రామచంద్రరావు, ములుగు – సోయం బాపూరావు(ఎంపీ), మేడ్చల్ – లక్ష్మణ్, పరిగి – విజయశాంతి..ఇలా కీలక నేతలకు కీలక స్థానాల్లో గెలుపు బాధ్యతలని అప్పగించారు.

అయితే వీటిల్లో కొన్ని స్థానాల్లో బీజేపీ బలపడుతుంది..కానీ కొన్ని స్థానాల్లో మూడో స్థానంలో ఉంది. మరి ములుగు, పరిగి, రామగుండం, వరంగల్ ఈస్ట్ లాంటి స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ కనిపిస్తోంది. మరి ఆ స్థానాల్లో బీజేపీ బలాన్ని ఎంతవరకు పెంచుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news