బాబు సింగిల్ స్ట్రాటజీ..వైసీపీని కన్ఫ్యూజ్ చేస్తున్నారా..!

-

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఈ మధ్య సైలెంట్ గా ఉన్నాయి. ఆయన పెద్దగా హడావిడి చేయకుండా…సైలెంట్ గా పార్టీలోని పనులు చక్కపెడుతున్నారు. ఓ వైపు రాజకీయంగా వైసీపీ, పవన్ మధ్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తుంది. ఈ క్రమంలో బాబు సైలెంట్ గా తమ పార్టీ బలం పెంచుకునేలా ముందుకెళుతున్నారు.ఇలా చేయడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అనే డౌట్ వస్తుంది.

ఎందుకంటే ఇటీవల బాబు ప్రజల్లోకి రావడంలేదు. అంటే పవన్ ప్రజల్లో తిరుగుతున్న నేపథ్యంలో తాను కూడా ప్రజల్లోకి వస్తే మీడియా అటెన్షన్, ప్రజలమధ్య చర్చ మారిపోతాయని అనుకుని ఉంటారు..అందుకే పవన్ యాత్ర అవ్వగానే బాబు రంగంలోకి దిగేలా ఉన్నారు. ఇక ఈలోపు పార్టీకి సరిచేసే కార్యక్రమాలు చేస్తున్నారు. మొదట ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న ఇంచార్జ్‌ లని బాబు నియమిస్తూ వస్తున్నారు. అలాగే పార్టీలో కొన్ని పదవుల విషయంలో కీలక మార్పులు చేస్తున్నారు.

అటు వైసీపీ నుంచి కొందరు నేతలని టి‌డి‌పిలో చేర్చుకుంటున్నారు. ఇలా బాబు పార్టీ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇక పలు స్థానాల్లో అభ్యర్ధులని కూడా ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. దీంతో ఆయన ఎన్నికలకు సిద్ధమయ్యారని తెలుస్తుంది.  ఇక అభ్యర్ధులని ఫిక్స్ చేస్తుండటంతో ఆయన ఏమైనా పొత్తు సెట్ కాకపోతే ఒంటరి పోరుకు కూడా రెడీ అవుతున్నారా? అనే డౌట్ విశ్లేషకుల నుంచి వస్తుంది. అయితే పొత్తు లేకుండా మాత్రం ఉండదని తెలుస్తుంది. ఖచ్చితంగా టి‌డి‌పి, జనసేన కలిసే పోటీ చేస్తాయని తెలుస్తుంది.

కాకపోతే ప్రస్తుతానికి ఇటు బాబు గాని, అటు పవన్ గాని మొదట తమ పార్టీలని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. తమ నాయకత్వంపై కేడర్ నమ్మకం తగ్గకుండా చూసుకుంటున్నారు.ఇలా చేయడం వల్ల పొత్తు ఉన్నా ఓట్లు బదిలీలో ఇబ్బందులు రావు. మొత్తానికి పొత్తు ఉన్నా బాబు,పవన్ ఇప్పుడు సెపరేట్ గా రాజకీయం చేసి వైసీపీని కన్ఫ్యూజ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version