జనంలో మార్పు..జగన్ తగ్గట్లేదంటా!

-

అబ్బో జనంలో మార్పు వచ్చేసింది…ప్రజలు జగన్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు..జనం మార్పు కోరుకుంటున్నారు…ఈ సారి ఖచ్చితంగా వైసీపీని ప్రజలు తిరస్కరిస్తారు…ఇంకా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పి చంద్రబాబు దగ్గర నుంచి తెలుగు తమ్ముళ్ళ వరకు ఇదే పాట పాడుతున్నారు. అసలు జగన్ పాలన పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు…ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు జగన్ ని ఓడించి పక్కన పెడతారని చెబుతున్నారు.

అసలు చంద్రబాబు ఏ జిల్లాలో పర్యటించిన ఇవే మాటలు చెబుతూ తిరుగుతున్నారు…మరి టీడీపీ చెబుతున్నట్లుగా నిజంగానే జనంలో జగన్ పాలన పట్ల వ్యతిరేకత మొదలైందా? ప్రజలు జగన్ ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారా? జనం మార్పు కోరుకుంటున్నారా? జగన్ బలం తగ్గిపోయిందా? అంటే చంద్రబాబు చెప్పే మాటలు పూర్తిగా నిజం కావనే చెప్పొచ్చు…అలా అని జగన్ పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారనే విషయం కూడా నిజం కాదనే చెప్పొచ్చు.

జగన్ అధికారంలోకి వచ్చి కరెక్ట్ గా మూడేళ్లు అయింది. మూడేళ్ళ పాలన అంటే జనంలో కాస్త వ్యతిరేకత రావడం సహజమే..ఆ వ్యతిరేకతే ఉంది తప్ప…చంద్రబాబు చెబుతున్నట్లుగా జనం జగన్ ని గద్దె దించేయాలనే వ్యతిరేకత మాత్రం లేదనే చెప్పాలి. ఇప్పటికీ జగన్ కు జానా బలం ఉంది…ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు వల్ల జగన్ ఫాలోయింగ్ తగ్గలేదు. ఒక్కసారి జిల్లాల వారీగా చూసుకుంటే..రాయలసీమలో కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పూర్తిగా వైసీపీకి లీడ్ ఉందని చెప్పొచ్చు. ఒక్క అనంతపురంలో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇస్తుంది.

ఇక నెల్లూరులో వైసీపీకే ఆధిక్యం కనిపిస్తుంది. ప్రకాశంలో వైసీపీ-టీడీపీల మధ్య పోటాపోటి కనిపిస్తోంది. అయితే కృష్ణా-గుంటూరు జిల్లాల్లో వైసీపీ కంటే టీడీపీ కాస్త లీడింగ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఫస్ట్ ప్లేస్ వైసీపీకే ఉంది. కానీ జనసేన గాని టీడీపీతో కలిస్తే ప్లేస్ మారిపోతుంది. ఉత్తరాంధ్రకు వస్తే విశాఖ, విజయనగరం జిల్లాల్లో వైసీపీకే లీడింగ్ ఉండగా, శ్రీకాకుళంలో పోటాపోటి ఉంది. మొత్తానికి చూస్తే వైసీపీకే లీడింగ్ కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news