కేసీఆర్ రివర్స్ ఎటాక్..బాబుని మించుతారా?

-

కేసీఆర్ దూకుడు పెంచారు..తెలంగాణలో తనకు చుక్కలు చూపిస్తున్న బీజేపీపై రివర్స్ ఎటాక్ మొదలుపెట్టడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో బీజేపీని టార్గెట్ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పైకి ఏదో దేశంలో మార్పు తేవాలని చెబుతున్నారు గాని…అసలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి రాష్ట్రంలో లబ్ది పొందాలనేది కేసీఆర్ టార్గెట్ గా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మీడియా సమావేశం  ద్వారా..బీజేపీని గట్టిగా టార్గెట్ చేసి విమర్శలు చేశారు.

అలాగే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ తప్పిదాలని ఎత్తిచూపాలని ఫిక్స్ అయ్యారు. తమ ఎంపీలకు దిశానిర్దేశం కూడా చేశారు…విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పోరాడాలని చెప్పారు. ఇదే సమయంలో కేసీఆర్ జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడానికి సిద్ధమవుతున్నారు. అలాగే కీలక జాతీయ నేతలని కలుపుకుని బీజేపీపై యుద్ధం చేయడానికి రెడీ అయ్యారు.

ఇప్పటికే మమతా బెనర్జీ, శరద్ పవార్, స్టాలిన్, అరవింద్‌ కేజ్రీవాల్‌, తేజస్వి యాదవ్‌, అఖిలేశ్‌ యాదవ్‌ లాంటి నేతలతో మాట్లాడి…జాతీయ స్థాయిలో బీజేపీపై చేసే పోరాటానికి కలిసిరావాలని కోరినట్లు తెలుస్తోంది. వారు కూడా కేసీఆర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే బలంగా ఉన్న బీజేపీపై పోరాటం అంత ఈజీ కాదు…ఏదో సొంత ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని హడావిడి చేస్తే…గట్టి దెబ్బ తగులుతుంది.

గతంలో చంద్రబాబు ఇలాగే జాతీయ స్థాయిలో హడావిడి చేశారు. 2019 ఎన్నికల ముందు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ధర్మపోరాట దీక్షల పేరుతో ఢిల్లీలో పలువురు జాతీయ నేతల మద్ధతుతో పోరాటాలు చేశారు. కానీ ఆ పోరాటాల వల్ల బీజేపీకి నష్టం ఏమి జరగలేదు. రివర్స్ లో బాబుకే భారీ నష్టం జరిగింది. జాతీయ స్థాయిలోనే కాదు…రాష్ట్రంలో దారుణంగా ఓడిపోయి…దెబ్బకు సైలెంట్ అయిపోయారు. మరి ఇప్పుడు కేసీఆర్ హడావిడి చేయడం మొదలుపెట్టారు…మరి నెక్స్ట్ కేసీఆర్ భవిష్యత్ ఏం అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news