తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగండ్ల వర్షాలకు చాలా పంటలు దెబ్బతిన్నాయని.. నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తం గా దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని ఈ రోజు ఆయన సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో.. రైతులకు నష్ట పరిహారం చెల్లించి వెంటనే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిర్చి పంటకు గాను ప్రతి ఎకరాకు రూ. 50 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని అన్నారు.
అలాగే ఇతర పంటలకు ఎకరాకు రూ. 25 వేల చొప్పున పరిహారం అందజేలనా అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ. 10 లక్షల చొప్పున నష్ట పరి హారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదీల ఉండగా.. మిర్చి రైతులను కలవడానికి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన ఎందుకు విరమించుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర రైతులను పట్టించుకునే తీరికా సీఎం కేసీఆర్ కు లేదా అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే.. రైతుల పక్షన కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తానమని తెలిపారు.