కోమటిరెడ్డిపై వేటుకు రెడీ?

-

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వేటుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికలో తన సోదరుడు, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా ఫోన్‌లో వెంకటరెడ్డి ప్రచారం చేశారనే సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి సంబంధించిన ఆడియో కూడా లీక్ అయింది. ఆ ఆడియోలో ఏ పార్టీ నుంచి పోటీ చేసిన రాజగోపాల్ మనోడు అని ఆయనకు సపోర్ట్ చేయాలని, మునుగోడు ఉపఎన్నిక తర్వాత పి‌సి‌సి పదవి నుంచి రేవంత్ రెడ్డిని తొలగిస్తారని, తర్వాత తనకే పి‌సి‌సి వస్తుందని చెప్పారు.

 

ఆ ఆడియో లీక్ కావడంపై కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం..వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది..రెండు సార్లు ఈ నోటీసులు ఇచ్చింది. ఇక దీనికి సమాధానం కూడా ఇచ్చానని వెంకటరెడ్డి చెప్పారు. అయితే వెంకటరెడ్డి ఇచ్చిన సమాధానం వివరణాత్మకంగా ఉంటే ఇబ్బంది లేదు..కానీ ఆయన సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయనే లీకులు వస్తున్నాయి. పైగా ఆ ఆడియో 2018 ఎన్నికల సమయంలోనిది అని అప్పుడు రాజగోపాల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారని, అప్పుడు ఆయన్ని గెలిపించాలని వెంకటరెడ్డి కోరారని కోమటిరెడ్డి వర్గం అంటుంది. కానీ ఆ ఆడియోలో పి‌సి‌సి రేవంత్ రెడ్డి అన్నారు..2018కు రేవంత్‌కు పి‌సి‌సి పదవి లేదు. పైగా ఏ పార్టీ నుంచి పోటీ చేసినా రాజగోపాల్ మనోడు అన్నారు..వీటిని బట్టి చూసుకుంటే వెంకటరెడ్డి ఇప్పుడు మాట్లాడిన మాటలే అని క్లియర్ గా అర్ధమవుతుంది.

ఈ అంశాలని రాష్ట్ర పి‌సి‌సి..క్రమశిక్షణ సంఘానికి క్లియర్ గా వివరించిందని తెలిసింది. ఈ పరిణామాల క్రమంలో వెంకటరెడ్డిపై కాంగ్రెస్ వేటు వేయడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. అసలు గాంధీ ఫ్యామిలీకి వీరవిధేయుడు అని చెప్పుకునే వెంకటరెడ్డి..రాహుల్ పాదయాత్ర తెలంగాణలో జరిగిన పాల్గొనలేదు. దీని బట్టి చూస్తే ఇంకా వెంకటరెడ్డి కాంగ్రెస్‌కు దూరం అవ్వడం ఖాయమని తెలుస్తోంది. మరి వెంకటరెడ్డి వ్యవహారం ఏం అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news