కాంగ్రెస్‌లో సీనియర్ల లొల్లి..బీసీ సీట్లలో రచ్చ.!

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎదోక రచ్చ జరగుతూనే ఉంటుంది. ఒకవేళ రచ్చ జరగకపోతే అది కాంగ్రెస్ పార్టీ కాదు. ఇటీవల అసెంబ్లీ టికెట్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కొత్త రూల్ పెట్టిన విషయం తెలిసిందే. సీటు కావాలని అనుకునేవారు..ఓసీ, బి‌సి అభ్యర్ధులు..రూ.50 వేలు ఫీజు కట్టి దరఖాస్తు చేసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.25 వేలు కట్టి దరఖాస్తు చేసుకోవాలని రూల్ పెట్టారు.

ఈ రూల్ పెట్టడంపై సీనియర్లు మండిపడుతున్నారు. అంటే దరఖాస్తు బట్టే సీట్లు ఇస్తారా? తమకు పోటీగా వేరే నేతలు దరఖాస్తు పెడితే అప్పుడు..వారికి సీటు ఇస్తే తమ పరిస్తితి ఏంటి అని అడుగుతున్నారు. అసలు ఇంతకాలం ఈ రూల్ లేదని, ఇప్పుడు కొత్తగా ఇదేంటి అని అడుగుతున్నారు. అయితే ఎవరికైనా ఇదే రూల్ ఉంటుందని, ఎవరైనా సీటు కావాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిందే అని, అలాగే సీటు దక్కకపోయినా ఫీజు తిరిగి ఇవ్వమని, అది కాంగ్రెస్ పార్టీకి వెళుతుందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.

అయితే ఒకో సీటుకు ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు స్క్రీనింగ్ కమిటీ అభ్యర్ధుల ఎంపిక చేసుకుంటుందని, ఫైనల్ గా అధిష్టానం సీట్లు ఖరారు చేస్తుందని అంటున్నారు.  ఈ ప్రక్రియ వల్ల తమకు పోటీగా ఎవరైనా వస్తే ఇమేజ్ దెబ్బ తింటుందని సీనియర్లు భావిస్తున్నారు.

ఇదే సమయంలో బి‌సిల సీట్ల విషయంలో కూడా రగడ నడుస్తోంది. బి‌సిలకు 34 సీట్లు కాదని, 48 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ లోని బి‌సి లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. 88 జనరల్ సీట్లు ఉన్న నేపథ్యంలో 48 బి‌సిలకు కేటాయించాలని కోరుతున్నారు. మరి చూడాలి చివరికి కాంగ్రెస్ లో సీట్ల పంపకాలు రచ్చకు దారితీస్తాయో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version