ఏదో అనుకుంటే ఏదో అయినట్లు ఉంది కేటీఆర్ రాజకీయం. తనదైన శైలిలో ప్రతిపక్షాల్ని ఇరుకున పెట్టాలని అనుకుని కేటీఆర్….తానే అనవసరంగా ఇరుక్కుపోయారు. ఏదో తాను రాజకీయం చేయడంలో తోపుని అన్నట్లుగా రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్‌లు రహస్యంగా కలిశారని విమర్శించారు. అలాగే కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి అభ్యర్ధి ఈటల అని మాట్లాడారు. తర్వాత ఈటల కాంగ్రెస్‌లోకి వెళ్తారని అన్నారు. అంటే హుజూరాబాద్‌లో ఈటలకు చెక్ పెట్టడానికి కేటీఆర్ పడిన పాట్లు ఇవి.
అంటే రేవంత్‌తో ఈటల కలిశారంటే..హుజూరాబాద్ ప్రజలు ఏమన్నా వ్యతిరేకిస్తారని అనుకున్నారేమో..కానీ అదే రివర్స్ అయింది..పైగా రేవంత్, ఈటల రాజేందర్‌లు కేటీఆర్ గాలి తీసేశారు. అవును ఈటలని కలిశానని, కానీ చీకట్లో కాదని, టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చాక ఒక ఫంక్షన్‌లో కలిశారని, టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ ఎలా బయటకు పంపారు.. ఎలా ముంచాడు..ఎలా వంచాడు…ఎలా దోచాడు అనే విషయాలని ఈటల తనకు చెప్పారని, భట్టి, ఉత్తమ్‌లని కూడా ఈటల కలిశారని కౌంటర్ ఇచ్చారు.
అటు ఈటల సైతం అదే తరహాలో కేటీఆర్‌కు కౌంటర్లు ఇచ్చేశారు. టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చాక అన్నీ పార్టీల నేతలతో కలిశానని, అలాగే రేవంత్‌ని కూడా కలిశానని చెప్పుకొచ్చారు. ఇక ఇద్దరి కౌంటర్లతో కేటీఆర్‌కు సౌండ్ ఆఫ్ అయిందని చెప్పాలి. కేటీఆర్ ఏదో అనుకుని రాజకీయ లబ్ది పొందాలని అనుకున్నారు. కానీ రేవంత్, ఈటలలు గట్టిగా ఇచ్చేశారు.
ఇక హీరో-విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్‌ని చంపేసినట్లు…మధ్యలో కౌశిక్ రెడ్డి బలయ్యాడు. కాంగ్రెస్‌లో ఉండగా కౌశిక్..కేటీఆర్‌తో రహస్యంగా ఎలా కలిశారు…ఎలా కాంగ్రెస్‌ని దెబ్బకొట్టాలని అనుకున్నారో కూడా అందరికీ తెలుసని కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతున్నాయి. తాను ఈటలను కలిసింది వాస్తవమేనని, కానీ దొంగ చాటున కలవలేదని, లంగ ముచ్చట్లు మాట్లాడుకోలేదని కేటీఆర్-కౌశిక్‌లని ఉద్దేశించి రేవంత్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చేశారు. మొత్తానికి రేవంత్, ఈటలలు కేటీఆర్ గాలి తీసి పారేశారు.