ఈటల కూడా ముదురే.. కేసీఆర్‌కు చుక్కలే..!

రాజకీయంగా అవకాశాలు దొరకాలే గానీ…ప్రతి నాయకుడికి మంచి సత్తా ఉంటుంది. కాకపోతే రాజకీయంగా అవకాశాలు దొరకక కొందరు నాయకులు సైలెంట్‌గానే ఉండిపోవాల్సి వస్తుంది. కానీ అవకాశాలు దొరికినప్పుడు వాటిని సరిగ్గా ఉపయోగించుకుని దూకుడుగా రాజకీయాలు చేయొచ్చు. సరిగ్గా ఈ విషయం ఈటల రాజేందర్‌కు సరిపోతుందనే చెప్పాలి. మామూలుగా ఈటల అంటే సౌమ్యంతో ఉండే నాయకుడు..రాజకీయ ప్రత్యర్ధులనైనా సరే ఆప్యాయంగా పలకరించే మనస్తత్వం.

etela-rajender | ఈట‌ల‌ రాజేందర్
etela-rajender | ఈట‌ల‌ రాజేందర్

అయితే అలాంటి నాయకుడు కూడా ఇప్పుడు దూకుడుగా మాట్లాడుతున్నారు. ఇలా ఈటల మాట్లాడటానికి కూడా కారణం కేసీఆర్ అనే చెప్పాలి…ఆయన చేసిన ద్రోహం వల్లే ఈటలలో చాలా మార్పు వచ్చింది. టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఈటలకు రాజకీయంగా పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఏదో తన పని తాను చేసుకునే వెళ్లిపోయేలా ఉండేవారు. ప్రత్యర్ధులపై కూడా దూకుడుగా విమర్శలు చేసేవారు కాదు. కానీ కేసీఆర్ ద్రోహం చేయడం…పార్టీ నుంచి బయటకెళ్లెలా చేయడంతో ఈటలలో చాలా మార్పులు వచ్చాయి.

ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్లుగా..మాటలతో మాయ చేసే కేసీఆర్‌ని అలాంటి మాయతోనే చెక్ పెట్టాలని ఈటల దూకుడుగా వెళుతున్నారు. మామూలుగా కేసీఆర్…ప్రతిపక్షాలని మరీ తీసి పారేసినట్లు మాట్లాడుతారు…తీవ్ర విమర్శలు చేస్తారు.

ఇప్పుడు అదే బాటలో ఈటల కూడా ఉన్నారు…అసలు చెప్పాలంటే కేసీఆర్‌ని ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ఇప్పటికే కేసీఆర్ బలం ఏంటో, బలహీనత ఏంటో ఈటలకు బాగా తెలుసు…అటు పార్టీలో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. కాబట్టి…టీఆర్ఎస్ నేతలు తనతో చాలామంది టచ్‌లో ఉన్నారని కారుని షేక్ చేస్తున్నారు. అవసరమైతే కేసీఆర్‌పై కూడా పోటీ చేస్తానని, కేసీఆర్ బలాలు..బలహీనతలేమిటో తెలుసని ప్రతీకారం తీర్చుకోకుండా వదిలి పెట్టనని రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు.

హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్‌ని కొట్టిన దెబ్బకు వచ్చి ధర్నాచౌక్‌లో పడ్డారని, భూమిమీదకు దిగివచ్చారని, ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారని.. ప్రగతిభవన్ ఇనుపకంచెలు కూడా తొలగిపోవాల్సి ఉందని, రాబోయే రోజుల్లో బీజేపీ ప్రళయం ఉంటుందని దాన్ని కేసీఆర్ తట్టుకోలేరని ఈటల అన్నారు. అంటే ఎంతో సౌమ్యంగా ఉండే ఈటల సైతం…కేసీఆర్‌కు ధీటుగా నిలబడి…ఆయనకే చుక్కలు చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్‌కు ఇంకా చుక్కలు చూపించేలా ఉన్నారు.