మంగళగిరిలో ‘ఫ్యాన్’ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా?

-

మరోసారి మంగళగిరిలో నారా లోకేష్ కు చెక్ పెట్టాలనే దిశగా వైసీపీ పనిచేస్తుంది..మళ్ళీ మంగళగిరిలో లోకేష్ ని ఓడించి సత్తా చాటాలని అనుకుంటుంది. అయితే గత ఎన్నికల మాదిరిగా…ఈ సారి ఎన్నికల్లో లోకేష్ ని ఓడించడం వైసీపీకి సులువా? అంటే అబ్బో చాలా కష్టమనే చెప్పాలి. గత ఎన్నికల్లో జగన్ వేవ్ ఉంది..టీడీపీపై వ్యతిరేకత ఉంది…అలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ప్రజల మనిషి అని పేరుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో లోకేష్ తక్కువ మెజారిటీతో ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఓడిపోయాక లోకేష్ రాజకీయం మారింది..గతానికి భిన్నంగా రాజకీయం చేస్తున్నారు. మాట తీరు మారింది…బాడీ లాంగ్వేజ్ మారింది. ఇప్పుడుప్పుడే బలమైన నాయకుడుగా ఎదుగుతున్నారు. అలాగే మంగళగిరిలో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ…ప్రజలకు ఇంకా దగ్గర అవుతున్నారు. అలాగే రాజధాని అమరావతి అంశం లోకేష్ కు బాగా కలిసొస్తుంది.

అదే సమయంలో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది….అటు ఆళ్ళకు అంత పాజిటివ్ కనిపించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సారి మంగళగిరిలో లోకేష్ గెలవడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఇక లోకేష్ గెలుపుకు ఎలాగైనా బ్రేక్ వేయాలని వైసీపీ రూట్ మారుస్తుంది. మంగళగిరిలో బలంగా ఉన్న టీడీపీ నేతలని వైసీపీ వైపుకు లాగుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుని వైసీపీలోకి తీసుకున్నారు. తాజాగా గంజి చిరంజీవి కూడా టీడీపీని వీడారు. టీడీపీలో బీసీలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. ఈయన కూడా వైసీపీలోకి వెళ్తారని తెలుస్తోంది.

అయితే ఇలా నేతలని లాగి లోకేష్ ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు…కాకపోతే ఇక్కడ వైసీపీ ప్లాన్స్ ఈ సారి అంత వర్కౌట్ అయ్యేలా లేవు. నాయకులు వెళ్లినంత మాత్రాన…వారి వెనుక కేడర్ వెళ్ళడం కష్టం. అలాగే ప్రజలు అనుకుంటే…ఈ నాయకుడు వెళ్ళిన ఫలితం ఉండదు. ఇక టీడీపీలో బీసీలకు చోటు లేదని చిరంజీవి అన్నారు…కానీ వైసీపీలో కూడా రెడ్డి వర్గానికి చెందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నారు. మరి అక్కడ బీసీలకు సీటు ఇచ్చే పరిస్తితి లేదు. మొత్తానికి చూసుకుంటే మంగళగిరిలో వైసీపీ ప్లాన్స్ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news