జగన్ కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్న రైతులు…!

-

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అంటూ ఆ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రాజకీయాల కోసం రాజధానిని చంపవద్దు అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ రాజధాని విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. మహిళలు, రైతులు అందరూ భారీగా రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా వెనక్కు తగ్గడం లేదు.

ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో రైతులు మరింత దూకుడుగా వెళ్తున్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో రాజధాని ప్రాంత రైతులు రోడ్ల మీదకు వస్తున్నారు. తాజాగా తుళ్ళూరులో సెల్ టవర్ ఎక్కి నిరసనలు చేస్తున్నారు రైతులు. ఎమ్మెల్యే శ్రీదేవి వచ్చే వరకు దిగేది లేదని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రాజధాని ప్రాంత రైతులు కొత్త పోరాటానికి సిద్దమవుతున్నారు.

న్యాయపోరాటానికి రైతులు అందరూ సిద్దమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో తీసుకున్న తమ భూములకు ఎకరాకు పది కోట్లు చెల్లించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఒప్పందం ప్రకారం ఉల్లంఘిస్తే 30 వేల ఎకరాలకు మూడు లక్షల కోట్లకు పైగా చెల్లించాలి అంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కోర్ట్ కి వెళ్ళడానికి కూడా సిద్దమైనట్టు సమాచారం.

ఈ మేరకు గత ప్రభుత్వం ఇచ్చిన ఒప్పంద పత్రాలను వాళ్ళు సిద్దం చేసుకుని కోర్ట్ కి వెళ్ళే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. కేబినేట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూసి ఆ తర్వాత రైతులు అందరూ న్యాయపోరాటానికి వెళ్ళాలి అని భావిస్తున్నారు. ఎక్కడా కూడా వెనక్కు తగ్గోద్దని భావిస్తున్నారు రైతులు. ఈ మేరకు రైతులు ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చారట.

Read more RELATED
Recommended to you

Latest news