బ్రేకింగ్; మండలి రద్దుకి కేంద్రం ఓకే…!

-

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకి కేంద్రం సిద్దంగా ఉందా…? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజాగా భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఒక ఛానల్ తో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. మండలి రద్దు అంశాన్ని కేంద్రం రాజకీయ కోణంలో చూడటం లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

రాజ్యాంగం ప్రకారమే ప్రక్రియను ముందుకు తీసుకెళతామని స్పష్టం చేసిన ఆయన, ఆలస్యం చేయడం, తొందరగా పూర్తి చేయడం లాంటివేవీ ఉండవన్నారు. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన లేదన్నారు. తమ నిర్ణయాలు అన్ని వ్యవస్థకు లోబడే ఉంటాయని వ్యాఖ్యానించారు. వ్యవస్థకు లోబడే నిర్ణయాలు ఉంటాయని 169(1) ప్రకారం అసెంబ్లీ.. తీర్మానాన్ని చేస్తే దాన్ని కేంద్రం ముందుకు తీసుకెళ్లాలి తప్ప తాము చేసేదేమీ ఉండదన్నారు.

అమరావతి ప్రాంత రైతుల అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తే కేంద్రం కచ్చితంగా స్పందిస్తుందని వ్యాఖ్యానించారు. కొందరు కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారని, ఈ అంశంలో రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తామన్నారు ఆయన. తమ పార్టీకి మంచి జరుగుతుందనో, చెడు జరుగుతుందనో చూడటం లేదన్న ఆయన, రాజ్యాంగం ఏది చెబితే దాని ప్రకారం కేంద్రం అడుగులు వేస్తుందని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news