హ‌మారా స‌ఫ‌ర్ : డైల‌మాలో బొత్స హుషారులో ధ‌ర్మాన

-

మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌కు సీఎం జ‌గ‌న్ సిద్ధం అవుతున్నారు. ఈ క్ర‌మంలో పాత ముఖాల‌ను పూర్తిగా త‌ప్పించాల‌ని అనుకున్నా కొన్ని సామాజిక స‌మీక‌ర‌ణాల దృష్ట్యా అది కుదిరేలా లేదు అని తేల్చి చెబుతున్నారు. ఈ క్ర‌మంలో రెండు ముఖాలు ఫిక్స్ అయ్యాయి. ఒకటి శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిని సీదిరి అప్ప‌ల్రాజు ముఖం, రెండు తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన చెల్లుబోయిన వేణు ముఖం.. ఈ రెండూ ఫిక్స్ అయ్యాయి. వీటితోపాటు అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కార్మిక శాఖ మంత్రి గుమ్మ‌నూరు జ‌యరాం కూడా ఉన్నారు.

 

క‌ర్నూలు జిల్లాకు చెందిన ఈయ‌న‌ను కొన‌సాగిస్తార‌ని తెలుస్తోంది. ఇక సీనియ‌ర్ లీడ‌ర్ అయిన బొత్స స‌త్య‌నారాయణ విష‌య‌మే ఎటూ తేల‌కుండా ఉంది. ఎందుకంటే ఆయ‌న‌ను కొన‌సాగించడం క‌ష్టం అని, ఆయ‌న స్థానంలో ఆయ‌న త‌మ్ముడు బొత్స అప్ప‌ల న‌ర్స‌య్య (విజ‌య‌న‌గ‌రం జిల్లా, గ‌జ‌ప‌తి న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే) కు అవ‌కాశం ఇచ్చేందుకు సీఎం మొగ్గు చూపుతున్నారు అని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. సీనియ‌ర్లు లేకుండా ఎక్కువ మంది జూనియ‌ర్ల‌తో జ‌గ‌న్ 2.0 క్యాబినెట్ ఫార్మ్ కావ‌డం అంత‌గా మంచిది కాద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ముఖ్య‌మంత్రిని ఎప్పుడూ వెన‌కేసుకుని వ‌చ్చే పేర్ని నాని మ‌రియు కొడాలి నానికి మ‌రో ఛాన్స్ ఇస్తార‌ని కూడా స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ బొత్స‌ను రిపీట్ చేయ‌రు. ఆయ‌న‌ను ఉత్త‌రాంధ్ర రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్ (వైఎస్సార్సీపీ పొలిటిక‌ల్ ఎఫైర్స్) గా నియ‌మిస్తారు.

మ‌రోవైపు ఆఖ‌రి నిమిషం వ‌ర‌కూ టెన్ష‌న్ టెన్ష‌న్ గానే ఉన్న ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు ప‌ద‌వీ యోగం ద‌క్కే విష‌యం క‌న్ఫం అయింది. దీంతో ధ‌ర్మాన సంబంధిత వ‌ర్గాలు సంబ‌రాలు చేసుకుంటున్నాయి. 2014లో ఓట‌మి త‌రువాత 2019లో గెలిచినా ప‌ద‌వి వెంట‌నే ద‌క్క‌క‌పోవ‌డం ఎలా చూసుకున్నా ఆయ‌న ఎనిమిదేళ్ల పాటు నిశ్శ‌బ్దంగానే ఉండిపోయారు. జ‌గ‌న్ కూడా ఆయ‌న‌ను కేవ‌లం శాస‌న స‌భా వ్య‌వ‌హారాల‌కే ప‌రిమితం చేయ‌డం. వీలున్నంత మేర‌కు స‌బ్జెక్టివ్ డిబేట్ లో పాల్గొన‌మని చెప్ప‌డం అదేవిధంగా కీలకం అయిన సంద‌ర్భాల్లో స‌బ్జెక్ట్ ఇచ్చి మాట్లాడించ‌డ‌డం వంటివివ చేశారు.

ఇటీవ‌ల న్యాయ వ్య‌వ‌స్థ‌ల‌కూ, శాసన వ్య‌వ‌స్థ‌ల‌కూ మ‌ధ్య ఉన్న సున్నితం అయిన విభ‌జ‌న రేఖ ఏ విధంగా ప్ర‌జా స్వామ్య వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేస్తుంది?చ‌ట్ట స‌భల నిర్ణ‌యాల్లో న్యాయ స్థానాల జోక్యం ఎంత వ‌ర‌కూ స‌బ‌బు ? ఎంత‌వ‌ర‌కూ సమ‌ర్థ‌నీయం ? అన్న విష‌యాల‌పై సుదీర్ఘ ఉప‌న్యాసం ఇచ్చారు. ఆ సంద‌ర్భంగా ధ‌ర్మాన‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. విప‌క్ష స‌భ్యులు కూడా ఆయ‌న ప్ర‌సంగానికి ఫిదా అయ్యారు. అటుపై ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి క‌న్ఫం అయింది. ప‌దవి ఉన్నా,లేక‌పోయినా తాను పుట్టి పెరిగిన శ్రీ‌కాకుళం జిల్లా అభివృద్ధికి తానెన్న‌డూ కృషి చేస్తాన‌నే అంటున్నారాయ‌న.

Read more RELATED
Recommended to you

Latest news