జోక్ కాదు జోస్యం : కేసీఆర్ ఇలానే ఉంటే మ‌ళ్లీ ఆయ‌నే పీఎం

-

స్కాంల‌ను వ‌ద్ద‌నుకున్నాం అని చెబుతున్నారు ఒక‌రు. ఆ విధంగా ఆద‌ర్శ‌మ‌యిన పాల‌న ఇస్తున్నాం అని చెబుతున్నారు ఒక‌రు . కానీ పైకి మాత్రం స్కాంల‌ను వ‌ద్ద‌ని, లోపాయకారిగా పార్టీ ఫండు పేరిట నిధులు పోగేసి, అటుపై సాముల‌ను న‌మ్ముకుని ఉంటున్నార‌ని ఆయ‌న్ను ఉద్దేశించి (ఆయ‌న అన‌గా కేసీఆర్‌).. విమ‌ర్శ‌లుచేస్తున్నారు ఇంకొంద‌రు. టైం వ‌స్తే స్కాంలు కూడా బ‌య‌ట‌ప‌డ‌తాయని, వాటికీ అక్క‌డ ఆస్కారం ఉంద‌ని, ఇందులో సందేహాల‌కు తావేలేద‌ని అంటున్నాయి బీజేపీ వ‌ర్గాలు. స్కాంలు ఎవ‌రివి లేవు అని..ఎవ‌రు చేయ‌లేదు అని టీఆర్ఎస్ శ్రేణులు కౌంట‌ర్లు ఇస్తున్నాయి. ఇంత‌కూ అంధ విశ్వాసాలు ఎవ‌రివి ? ఆత్మ విశ్వాసం ఎవ‌రిది ?

ఇదేం ప‌ద్ధ‌తి సారూ!

ఇవాళ ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న (ఒక్క‌రోజు ప‌ర్య‌ట‌న అని రాయాలి) తెలంగాణ‌లో సాగింది. ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తాలుకా ఫంక్ష‌న్ కు వ‌చ్చి వెళ్లారు. అటుపై కార్య‌క‌ర్త‌ల స‌మావేశాన్ని నిర్వ‌హించి, గులాబీ బాస్ పై, ప‌నిలో ప‌నిగా అదే వేదిక‌పై కొన్ని కామెంట్లు పాస్ చేశారు. అంధ విశ్వాసాలు న‌మ్ముకున్న నాయ‌కుల కార‌ణంగా ఎటువంటి అభివృద్ధి ఉండ‌ద‌ని పరోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇవే ఇప్పుడు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. మూఢ న‌మ్మ‌కాల‌ను న‌మ్మేవారు తెలంగాణ‌ను బాగు చేయ‌లేర‌ని కూడా తేల్చేశారు. ఒకే ఈ అభిప్రాయం ఎలా ఉన్నా కూడా ఇవాళ కేసీఆర్ మాత్రం పీఎంకు ఎదురుప‌డ‌క‌పోవ‌డం మాత్రం అస్స‌లు బాలేదు అని అంటున్నారు కొంద‌రు.

ఎందుకంటే..

దేశ ప్ర‌ధానికి గో బ్యాక్ చెప్ప‌డం బాలేదు.. అదేవిధంగా ఆయ‌న ఓ ప్ర‌తిష్టాత్మ‌క విద్యా సంస్థ‌కు వ‌చ్చిన‌ప్పుడు క‌నీసం స్వాగ‌తం ప‌లికేందుకు కూడా సీఎం లేక‌పోవ‌డం బాలేదు..అని అంటున్నాయి బీజేపీ శ్రేణులు. ఉన్న‌ట్టుంది బెంగ‌ళూరుకు వెళ్లాల్సిన ప‌ని ఏం వ‌చ్చింద‌ని., ఆయ‌నేమ‌యినా బ‌ల‌మైన లీడ‌రా అని జేడీఎస్ అధినేత దేవెగౌడ‌తో కేసీఆర్ భేటీని ఉద్దేశించి కూడా కొన్ని సెటైర్లు వ‌స్తున్నాయి. కేసీఆర్ ఆ రోజు బాబు చేసిన త‌ప్పిదాలే చేస్తున్నార‌ని, ఇలా అయితే మ‌రోసారి కూడా కేసీఆర్ లాంటి నాయ‌కుల అప‌రిప‌క్వ‌త కార‌ణంగానే పీఎంగా మోడీ మ‌రోసారి ప‌ద‌వీ బాధ్య‌త‌లు అందుకోవ‌డం ఖాయం అని అంటున్నాయి బీజేపీ శ్రేణులు సోష‌ల్ మీడియా వేదిక‌గా గులాబీ బాస్-ను ఏకిపారేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news