వైసీపీలో ఆ ఓట్లు కాంగ్రెస్‌కు వెళ్తాయా? సర్వేలో ఏం తేలింది?

-

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పార్టీల బలాబలాలపై రకరకాల సర్వేలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటు పార్టీలు సైతం సొంతంగా సర్వేలు చేసుకుంటున్నాయి. టి‌డి‌పి, వైసీపీలు ఎవరికి వారు తమకే గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాయి. ఇటు జనసేన సైతం తాము సత్తా చాటుతామని అంటుంది. అయితే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ..ఆయన కూడా సొంతంగా సర్వే చేయిస్తున్నా విషయం తెలిసిందే.

ఆ మధ్య కూడా ఆయన తాను సర్వే చేసినట్లు కొన్ని రిపోర్టులని మీడియా ముందు పెట్టారు. అయితే వీటిల్లో ఏ సర్వేలు నిజమవుతాయో చెప్పలేం..ప్రజలు ఎటు వైపు ఉన్నారో ఇప్పుడే సర్వేలు పసిగట్టడం కూడా కష్టమే. కానీ ఎవరికి నచ్చిన విధంగా వారు సర్వే అంటున్నారు. తాజాగా రఘురామ కూడా తనకు ఓ సర్వే రిపోర్టు వచ్చిందని చెప్పి మీడియా ముందు ఓ సర్వే గురించి మాట్లాడారు. ఏపీ ఓటర్ మదిలో ఏముంది? అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. 2009లో కాంగ్రెస్ విజయం సాధించిందని, అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ కాస్తా వైసీపీగా మారిందని అన్నారు.

ఇక గతంలో కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లు వైసీపీ వేశారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ఇప్పుడు 6 శాతం మేర ఓట్లు వైసీపీకి నష్టం చేయనున్నాయని, ముస్లిం మైనార్టీ ఓట్లు రాజశేఖర్ రెడ్డిని చూసి ప్రజలు వైసీపీకి ఓట్లు వేశారని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముస్లిం సోదరులు కాంగ్రెస్‌కు వేసే పరిస్థితి వచ్చిందన్నారు. ముఖ్యంగా కడపలో ఈ ప్రభావం ఎక్కువ ఉంటునని చెప్పుకొచ్చారు.

అలాగే వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు అయిన ఎస్సీ , ఎస్టీలో కొంత శాతం మార్పు కనిపిస్తోందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 40 సీట్లు మాత్రమే వచ్చే విధంగా కనిపిస్తోందని అన్నారు. ప్రతిపక్షాల పొత్తులపై క్లారిటీకి కొంత సమయం పడుతుందని అన్నారు. అయితే బి‌జే‌పికి వైసీపీ మద్ధతు ఇస్తుందనే కోణంలోనే రఘురామ ఇలా చెప్పి ఉంటారు..కానీ అదే బి‌జే‌పితో జనసేన-టి‌డి‌పి పొత్తుకు వెళుతున్నాయి. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడటం అసాధ్యం. అలాంటప్పుడు ఆ పార్టీకి ఓటు వేసి వృధా చేసుకోరు. కాబట్టి రఘురామ చెప్పేది ఏది వర్కౌట్ కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version